క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వరల్డ్ కప్  ప్రారంభం కావడానికి మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో... ఎవరివారు తమ ఫేవరేట్ టీమ్ లను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు.. తమ ఫేవరేట్ జట్ల పేరు ప్రకటించాయి. తాజాగా... ఈ ఘటనపై గంభీర్ స్పందించాడు. 

తన ఫేవరేట్ జట్టు మాత్రం ఆస్ట్రేలియానే అని ప్రకటించాడు. ఆ తర్వాత స్థానంలో ఇండియా, ఇంగ్లాండ్ ఉన్నాయని చెప్పడం విశేషం. ఈసారి టైటిల్‌ కొట్టేది మాత్రం ఆస్ట్రేలియానే అని నమ్మకం వ్యక్తం చేశాడు. 

‘ఇంగ్లాండ్‌ తన సొంతగడ్డపై ఆడుతుండటమే ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అందులోనూ ఆ జట్టు ఇంకా స్ట్రాంగ్   కనిపిస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమతూకంగా ఉంది. నలుగురు ఆల్‌రౌండర్లు ఉండటం ఇంగ్లాండ్‌కు అదనపు బలం. అయితే, నా ఫేవరెట్‌ జట్టు మాత్రం ఆస్ట్రేలియానే.. ఎందుకంటే ఆ జట్టు ఫైనల్‌ చేరుకునేందుకు సరైన పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగుతుంది. ఫైనల్‌లో ఆ జట్టు ఇండియా లేదా ఇంగ్లాండ్‌తో తలపడాల్సి రావొచ్చు. ఆసీస్‌ జట్టు మాత్రం కచ్చితంగా ఫైనల్‌ వరకూ చేరుకుంటుంది’ అని పేర్కొన్నాడు.