చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చహల్.. ఐపీఎల్ లో 200 వికెట్లు.. !
Yuzvendra Chahal : ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా యుజ్వేంద్ర చాహల్ ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడు మహ్మద్ నబీ వికెట్ పడగొట్టడం ద్వారా ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో 200వ వికెట్ తీసిన తొలి ఆటగాడిగా యుజ్వేంద్ర చాహల్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
Yuzvendra Chahal : జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ 2024 38వ మ్యాచ్ జరిగింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరూ ఓపెనర్లుగా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 6, ఇషాన్ కిషన్ 0, సూర్యకుమార్ యాదవ్ 10 పరుగుల వద్ద ఔటయ్యారు. వరుస వికెట్లు కోల్పోయి ముంబై ఆటగాళ్లు ఆర్ఆర్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో ముంబై ఇండియన్స్ 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 50 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలోనే అద్భుతమైన బౌలింగ్ తో యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు.
ఇప్పటి వరకు 152 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన యుజ్వేంద్ర చాహల్ 199 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్‌తో తన 153వ ఐపీఎల్ మ్యాచ్‌లోనూ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. మ్యాచ్ 8వ ఓవర్ యుజ్వేంద్ర చాహల్ వేశాడు. ఈ ఓవర్ 3వ బంతికి మహ్మద్ నబీ వికెట్ తీశాడు. దీంతో ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. దీనికి ముందు 1 నుండి 200 వికెట్లు తీసిన మొదటి బౌలర్లను గమనిస్తే..
VIRAT KOHLI : అంపైర్ తో విరాట్ కోహ్లీ గొడవ.. కోపానికి శిక్ష పడింది..
25 వికెట్లు - షేన్ వార్న్
50 వికెట్లు - ఆర్పీ సింగ్
75 వికెట్లు - లసిత్ మలింగ
100 వికెట్లు - లసిత్ మలింగ
125 వికెట్లు - లసిత్ మలింగ
150 వికెట్లు - లసిత్ మలింగ
175 వికెట్లు - డ్వేన్ బ్రావో
200 వికెట్లు - యుజ్వేంద్ర చాహల్*
IPL 2024 : వరుస ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీకి మరో బిగ్ షాక్..
- 200 wickets
- BCCI
- Chahal
- Cricket
- Games
- IPL
- IPL 2024
- Indian Premier League
- Indian Premier League 17th Season
- Mumbai
- RR vs MI
- Rajasthan
- Rajasthan Royals vs Mumbai Indians
- Rajasthan vs Mumbai
- Sports
- Tata IPL
- Tata IPL 2024
- Team India
- Yuzvendra Chahal
- Yuzvendra Chahal 200 wickets
- Yuzvendra Chahal in IPL
- Yuzvendra Chahal's new record