Asianet News TeluguAsianet News Telugu

వాంఖడేను కాదని బ్రబౌర్న్ స్టేడియంలో మ్యాచ్ జరపడానికి కారణమిదే....

ముంబయిలో సోమవారం భారత్-వెస్టిండిస్ ల మధ్య  నాలుగో వన్డేలో టీంఇండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియాన్ని కాదని ఈ మ్యాచ్ ను బ్రబౌర్న్ స్టేడియంలో జరగడంపై అభిమానుల్లో పలు సందేహాలు తలెత్తాయి. 23 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ స్టేడియంలో ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ నిర్వహించడానికి బిసిసిఐ ఎందుకు మొగ్గు చూపిందో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.

why bcci shifted fourth ODI  from Wankhede stadium to Brabourne?
Author
Mumbai, First Published Oct 30, 2018, 4:47 PM IST

ముంబయిలో సోమవారం భారత్-వెస్టిండిస్ ల మధ్య  నాలుగో వన్డేలో టీంఇండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియాన్ని కాదని ఈ మ్యాచ్ ను బ్రబౌర్న్ స్టేడియంలో జరగడంపై అభిమానుల్లో పలు సందేహాలు తలెత్తాయి. 23 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ స్టేడియంలో ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ నిర్వహించడానికి బిసిసిఐ ఎందుకు మొగ్గు చూపిందో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.

మొదట నాలుగో వన్డేను వాంఖడే స్టేడియంలోనే నిర్వహించేందుకు బిసిసిఐ తో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్ లు భావించాయి. అయితే ఎంసీఏలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల ఈ మ్యాచ్ ను బ్రబౌర్న్ స్టేడియంకు మార్చారు. 

ఎంసిఏ బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు చూసేందుకు ప్రత్యేకంగా అధికారులు లేరు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు మాజీ న్యాయమూర్తులు ఈ వ్యవహారాలను చూసేవారు. అయితే ఇటీవల వీరు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో అసంతృప్తికి లోనై రాజీనామా చేశారు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఎంసిఏ ఆర్థిక వ్యవహారలను చూసేవారు మళ్లీ కరువయ్యారు.

అయితే వాంఖడే స్టేడియంలో మ్యాచ్ నిర్వహించాలంటే టికెట్ల అమ్మకాలకు, ప్రకటనలకు టెండర్లు, క్యాటరింగ్‌కు టెండర్లకు, నిర్వహణ అవసరాలకు డబ్బులు కావాలి. వాటిని చూసుకోడానే ప్రత్యేక అధికారులు అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఈ సందిగ్దం  నుండి బైటపడేందుకే బిసిసిఐ ముందున్న ఒకే దారి బ్రబౌర్న స్టేడియం. అందువల్లే నాలుగో వన్డేను బ్రబౌర్న్ స్టేడియంలో నిర్వహించారు.   

బ్రబౌర్న మైదానం ఎంసీఏ ఆదీనంలో కాకుండా వేరేవారి ఆదీనంలో ఉంది. దీంతో ఇక్కడ మ్యాచ్ నిర్వహించడానికి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో బిసిసిఐ ఇండియా, వెస్టిండీస్ మ్యాచ్ ఇక్కడికి మార్చింది. దీంతో 23 ఏళ్ల  తర్వాత మళ్లీ ఇక్కడ వన్డే మ్యాచ్ చూసే అదృష్టం భారత అభిమానులకు దక్కింది. 

మరిన్ని వార్తలు

ఆ అనుమానాలు ఇప్పుడు లేవు.. రాయుడిపై రోహిత్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా.. షోయబ్ ట్వీట్

కాల్పుల కేసులో శ్రీలంక మాజీ కెప్టెన్ అరెస్ట్...

ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు బద్దలుగొట్టిన రోహిత్....రెండూ సచిన్‌వే

ధావన్‌ను ఔట్ చేసి అతడి స్టైల్లోనే విండీస్ బౌలర్ సెలబ్రేషన్...

కోహ్లీకి అక్తర్ 120 సెంచరీల టార్గెట్

అలిగిన వార్నర్.. మ్యాచ్ మధ్యలో నుంచే వెళ్లిపోయాడు

సెలక్షన్ కమిటీ పై మండిపడుతున్న ధోని ఫ్యాన్స్

 

Follow Us:
Download App:
  • android
  • ios