మహేంద్ర సింగ్ ధోనీ... ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న భారత క్రికెటర్. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ ధోనీయే. ఈ రేంజ్ ఫాలోయింగ్ రావడానికి వికెట్ల వెనకాల మెరుపు వేగంతో ధోనీ చేసే వికెట్ కీపింగ్ కూడా ఓ కారణం. అయితే కొన్నాళ్లుగా ధోనీ క్రికెట్‌కి దూరంగా ఉంటూ రావడం, సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించడంతో మాహీ మ్యాజిక్‌ని అంతా మిస్ అయ్యారు. అయితే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ డేవిడ్ బెడింగమ్ అచ్చు ధోనీలాగే వికెట్లను గిరాటేశాడు.

ఇంగ్లాండ్ టీ20 లీగ్ ‘ది విర్టలిటీ బ్లాస్ట్ 2020’లో భాగంగా లిసస్టెర్‌షైర్ కెప్టెన్ కోలిన్ అకెర్‌మాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ సీన్ వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోలిన్ అకెర్‌మాన్ బ్యాట్‌ను తాకుతూ వెళ్లిన బంతి, నేరుగా కీపర్ చేతులను తాకింది. అయితే క్యాచ్ అందుకోవడంతో విఫలమైన డేవిడ్, మెరుపు వేగంతో బంతిని నాన్-స్ట్రైకింగ్ వైపు విసిరాడు. అది నేరుగా వెళ్లి వికెట్లను తాకడంతో బ్యాట్స్‌మెన్‌ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.

డేవిడ్ బంతి విసిరిన వేగానికి వికెట్ ఎగిరి పడింది. మనోడి త్రో చూస్తుంటే, మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుకువచ్చాడని క్రికెట్ అభిమానులు కొందరు కామెంట్లు చేస్తుంటే, మరికొందరేమో కేవలం కెమెరామెన్ పనితనం వల్లే డేవిడ్ వేసిన త్రో, అద్భుతంగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.. ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియో మీరు కూడా చూసేయండి.