Search results - 523 Results
 • cricket

  CRICKET20, Mar 2019, 5:25 PM IST

  యువ క్రికెటర్ మృతి...మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ హటాత్తుగా కుప్పకూలి

  క్రికెట్ అంటే అతడికి ప్రాాణం. చిన్నప్పటి నుండి గొప్ప క్రికెటర్ గా ఎదగాలని కలలు కనేవాడు. కేవలం కలలే కాదు  అందుకోసం కఠోరంగా శ్రమించేవాడు. ఇలా క్రికెటర్ గా రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తూ తన కలలకు దగ్గరవుతున్న సమయంలో అతడిని విధి వంచించింది. తోటి ఆటగాళ్లతో కలిసి ప్రాక్టిస్ సెషన్లో పాల్గొంటూ మైదానంలోనే ఒక్కసారిగా కుప్పకూలి   ఈ యువ క్రికకెటర్ ప్రాణాలు వదిలాడు. ఈ విషాద సంఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకుంది. 

 • CRICKET20, Mar 2019, 4:34 PM IST

  టీమిండియాకు వరల్డ్ కప్‌ అందిచే సత్తా రిషబ్‌‌కు వుంది: ఆసిస్ మాజీ కెప్టెన్

  ఆస్ట్రేలియా జట్టుపై వారి స్వదేశంలోనే సెంచరీ సాధించడం ద్వారా టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ ఆనందం అతడికి ఎంతోకాలం నిలవలేదు.  అదే ఆస్ట్రేలియాపై ఇటీవల భారత్ లో జరిగిన వన్డే సీరిస్‌లో రిషబ్ చెత్త ప్రదర్శనతో టీమిండియా ఓటమికి కారణమై తీవ్ర విమర్శలపాలయ్యాడు. ఇలా ఒకే జట్టుపై ఓసారి ఆకాశమే హద్దుగా సాగిన ప్రశంసలు, మరోసారి పాతాళానికి తొక్కెస్తూ సాగిన విమర్శలను రిషబ్ చవిచూశాడు. ఇలా ఇటీవల తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న రిషబ్ కు ఆసిస్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్, మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ అండగా నిలిచారు. 

 • CRICKET20, Mar 2019, 2:34 PM IST

  ఐపిఎల్ 2019: హైదరాబాద్ లో జరిగే మ్యాచులివే

  ఇండియన్ ప్రీమియర్ లీగ్...ఈ ఏడాది క్రికెట్ ప్రియులకు మజా పంచడానికి సిద్దమైంది. ఈ నెల 23న ప్రారంభమై దాదాపు రెండు నెలల పాటు ఐపిఎల్ ఫీవర్ తో అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఎప్పుడూ ఒక్కటిగా వుండే టీమిండియా అభిమానులు ఐపిఎల్ లో మాత్రం రాష్ట్రాలవారిగా విడిపోయి తమ తమ జట్లకు సపోర్ట్ చేస్తుంటారు. ఇలా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ గా చేయడానికి కూడా తెలుగు అభిమానులు సిద్దమయ్యారు. ఇలా తమ జట్టుకు మరోసారి టైటిల్ విజేతగా నిలిపేందుకు తమ వంతుగా సన్ రైజర్స్ ఆటగాళ్లను మైదానంలో సపోర్ట్ చేయడానికి కూడా ఇరు తెలుగు రాష్ట్రాల అభిమానులు కూడా సిద్దమయ్యారు.  

 • virat_gambhir

  CRICKET19, Mar 2019, 6:53 PM IST

  విరాట్ కోహ్లీ అంత గొప్ప కెప్టెనేం కాదు: గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్  లీగ్) జట్లల్లో కొన్నింటికి చాలా మంచి కెప్టెన్లున్నారని గంభీర్ అన్నారు. అలాంటి వారిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలు అత్యుత్తమ కెప్టెన్లని పేర్కొన్నారు. వీరి సరసన కోహ్లీని చేర్చడాన్ని గంభీర్ తప్పుబట్టాడు. రాయల్ చాలెంజర్స్ జట్టును ముందుడి నడిపిస్తూ విజయాలు అందించడంలో ప్రతి సీజన్ లో విరాట్ కోహ్లీ విఫలమవుతున్నాడని... అందువల్లే అతన్ని అత్యుత్తమ సారథిగా తాను భావించడంలేదని గంభీర్ వివరించాడు.

 • ipl

  CRICKET19, Mar 2019, 5:05 PM IST

  ఐపిఎల్ 2019: పూర్తి షెడ్యూల్ విడుదల

  ఐపిఎల్ సీజన్ 12 పై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది.  పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా  గతంలో మాదిరిగా ఈ సారి కూడా టోర్నీని విదేశాలకు తరలించే అవకాశముందన్న ప్రచారానికి తెరపడింది. ఈ ఐపిఎల్ మొత్తాన్ని భారత్ లోనే నిర్వహించనున్నట్లు బిసిసిఐ స్ఫష్టం చేసింది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. 

 • CRICKET19, Mar 2019, 4:44 PM IST

  బుమ్రా ఐపిఎల్ ఆడాల్సిందే...: ముంబై ఇండియన్స్ చీఫ్ కోచ్

  భారత జట్టులో చాలా తక్కువ సమయంలో కీలక బౌలర్ గా ఎదిగిన ఆటగాడు జస్ప్రీత్ సింగ్ బుమ్రా. కీలక సమయాల్లో ప్రత్యర్ధి బ్యాట్ మెన్స్ వికెట్లు పడగొట్టడం, డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడంలో బుమ్రా స్పెషాలిటి. ఇలా మ్యాచ్ విన్నర్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న అతడికి దాదాపు ప్రపంచ కప్ బెర్తు ఖాయమయ్యింది. దీంతో ఐపిఎల్ కారణంగా గాయాలపాలయ్యే అవకాశం వుండటంతో ఈసారి బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టుకు దూరమయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా ముంబై  జట్టు చీఫ్ కోచ్, శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే క్లారిటీ  ఇచ్చారు. 

 • dhoni with kumble

  CRICKET18, Mar 2019, 7:48 PM IST

  ధోనిపై కోహ్లీ విపరీతంగా ఆధారపడుతున్నాడు: అనిల్ కుంబ్లే

  ఆసిస్ తో ఇటీవల స్వదేశంలో ముగిసిన వన్డే సీరిస్‌‌ను వరుస ఓటములతోె టీమిండియా కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఆరంభం భాగానే వున్నా చివరి రెండు వన్డేల్లో ధోని జట్టుకు దూరమవడం వల్లే భారత్ ఓటమిపాలయ్యిందని క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ  ఆరోపణతో టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఏకీభవించారు. 

 • Dhoni in the ground with a fan video

  CRICKET18, Mar 2019, 6:23 PM IST

  ధోనిని మరోసారి పరుగెత్తించిన అభిమాని... (వీడియో)

  మహేంద్ర సింగ్ ధోని... యావత్ భారత క్రికెట్ అభిమానులను తన ఆటతీరు, కెప్టెన్సీతో తన అభిమానులుగా మార్చుకున్న ఆటగాడు. మొదట్లో అతడి జులపాల హెయిర్ స్టైల్, ధనాధన్ షాట్లతో అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు ముషారప్ చేతే ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత తన అత్యుత్తమ ఆటతీరుతో భారత జట్టులో కీలక ఆటగాడిగానే కాదు జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించి కూల్ కెప్టెన్ గా పేరుతెచ్చుకుని విజయవంతమయ్యారు.

 • IPL 2019

  CRICKET16, Mar 2019, 10:20 AM IST

  ఐపిఎల్ ప్రసార సమయంలో ఆ యాడ్స్ వద్దు: స్టార్ స్పోర్ట్స్ కు తేల్చిచెప్పిన బిసిసిఐ

  ఐపిఎల్...భారతీయ క్రీడాభిమానులకు సమ్మర్ లో వినోదాల విందును అందించే క్రికెట్ టోర్నీ. లోక్ సభ ఎన్నికలు... దేశ రాజకీయాలను మరింత హాట్ హాట్ గా మార్చి  రాజకీయ నాయకులే కాదు సామాన్యులు కూడా ఆసక్తిని కనబరిచే రాజకీయ పోరాటం. అయితే ఈ రెండూ ఈసారి  ఒకేసారి కలిసి వచ్చి భారత ప్రజలకు మరింత మజాను ఇవ్వనున్నాయి. ఈ రెండు కేవలం మజానే కాదు టివి చానళ్లను ఆదాయంలో ముంచెత్తడంలో కూడా ముందుంటాయి.  

 • pandya batting

  CRICKET15, Mar 2019, 5:20 PM IST

  పాండ్యా బ్యాట్ నుండి ధోని స్టైల్ హెలికాప్టర్ షాట్ (వీడియో)

  మహేంద్ర సింగ్ ధోని... అభిమానుకే కాదు టీమిండియా యువ క్రికెటర్లు కూడా అతడంటే చాలా ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు క్రికెట్  మెలకువలు నేర్చుకోడానికి ప్రయత్నిస్తూ ధోనికి మాత్రమే సాధ్యమయ్యే షాట్లను అనుకరనిస్తుంటారు. ఇలా సాంప్రదాయ క్రికెట్ షాట్లకు భిన్నంగా అతడి బ్యాట్ నుండి జాలువారే హెలికాప్టర్ షాట్లంటే వారు మరింతగా ఇష్టపడతారు. ఇలా ధోనికి మాత్రమే సాధ్యమయ్యే ఈ షాట్లను యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా అనుకరించాడు.  

 • rohit mi

  CRICKET15, Mar 2019, 3:40 PM IST

  నయా రికార్డును సృష్టించాలంటూ ప్రధాని అభ్యర్థన... స్పందించిన రోహిత్

  మరికొద్దిరోజుల్లో దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రజల్లో చైతన్యం కలిగించడానికి సీని, క్రీడా ప్రముఖుల సహకారాన్ని ఆయన కోరారు. ఇలా తాజాగా మోదీ తమను ఉద్దేశించి ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలంటూ చేసిన అభ్యర్థనపై టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. 

 • dhoni sunny

  CRICKET14, Mar 2019, 9:05 PM IST

  ధోనీయే నా ఫేవరెట్... క్రికెటర్‌గానే కాదు మరోలా కూడా : సన్నీ లియోన్

  మహేంద్ర సింగ్ ధోని... క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ధనాధన్ ఇన్నింగ్సులకు, హెలికాప్టర్ షాట్లకు అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇక కీఫర్ గా అతడిని మించిన వారు లేదనడంలో అతిశయోక్తి లేదేమో. ఇక అతడు టీమిండియా కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించి ఎన్నో విజయాలను అందించి కెప్టెన్ కూల్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇలా క్రికెట్ లోకాన్ని తన అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్న అతడు ఓ బాలీవుడ్ సెక్సీ భామకు మాత్రం మరోలా నచ్చాడట. 

 • sanjay

  CRICKET14, Mar 2019, 2:06 PM IST

  డిల్లీ వన్డే ఓటమికి వారిద్దరే కారణం: సంజయ్ మంజ్రేకర్

  డిల్లీ వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోడానికి భారత మిడిల్ ఆర్డర్ వైఫల్యమే కారణమని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఈ స్థానాల్లో బరిలోకి దిగిన యువ ఆటగాళ్ళు రిషబ్ పంత్, విజయ్ శంకర్ ల వల్లే ఈ మ్యాచ్‌లో భారత ఓటమిపాలయ్యిందన్నారు. ఈ వైఫల్యం కేవలం మ్యాచ్ నే కాదు వన్డే సీరిస్ ను కూడా టీమిండియాకు దూరం చేసిందని మంజ్రేకర్ అన్నారు. 

 • team india

  CRICKET13, Mar 2019, 1:55 PM IST

  న్యూడిల్లీ వన్డే: భారత జట్టులో రెండు మార్పులు...ముగ్గురు పేసర్లు

  భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్ విజయాన్ని నిర్ణయించే చివరి మ్యాచ్‌లో న్యూడిల్లీలో ఆరంభమైంది. ఇప్పటికే 2-2తో సమఉజ్జీలుగా నిలిచిన ఆతిథ్య, పర్యాటక జట్లకు ఈ వన్డే ప్రతిష్టాత్మకంగా మారింది. ఏ జట్టు సీరిస్ ను కైవసం చేసుకుంటుందనేది ఈ మ్యాచ్ నిర్ణయించనుంది. దీంతో ఇరు జట్లు పలు మార్పులతో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో అడుగుపెడుతున్నాయి. 

 • CRICKET12, Mar 2019, 8:17 PM IST

  హైదరాబాద్ అభిమానులూ...మళ్లీ మన సమయం వచ్చింది: డేవిడ్ వార్నర్ (వీడియో)

  బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా జట్టుతో పాటు గతేడాది ఐపిఎల్ సీజన్ కు డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు. అయితే ఇది ఆసిస్ అభిమానులను  ఎంతలా నిరాశపర్చిందో అంతకంటే ఎక్కువగా హైదరాబాద్ క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేసింది. ఎందుకంటే ఐపిఎల్ లో అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు
  కెప్టెన్ గానే కాదు తన విద్వంసకర ఆటతీరుతో ఒంటిచేత్తో ఎన్నొ మ్యాచులు గెలిపించిన ఆటగాడు. అలాంటిది గత ఐపిఎల్ సీజన్ లో అతడి బ్యాట్ నుండి జాలువారే విద్వంకర షాట్లతో ఫుల్ ఎంటర్ టయిన్ కావాలనుకున్న హైదరబాదీలు నిరాశకు గురయ్యారు.