Asianet News TeluguAsianet News Telugu

టోక్యో ఒలింపిక్స్: చరిత్ర సృష్టించిన అదితి అశోక్... మెడల్ రాకపోయినా గోల్ఫ్‌లో...

మూడు రౌండ్లు ముగిసేవరకూ టాప్ 2లో ఉన్న అదితి అశోక్...

ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన మొట్టమొదటి భారత గోల్ఫర్‌గా చరిత్ర...

Tokyo Olympics 2020: Aditi Ashok finishes at 4th position, just missed medal CRA
Author
Tokyo, First Published Aug 7, 2021, 10:27 AM IST

టోక్యో ఒలింపిక్స్‌లో భారత గోల్ఫర్ అదితి అశోక్ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. గోల్ఫ్‌లో నాలుగో స్థానంలో నిలిచి, అద్భుతం చేసింది. గోల్ఫ్‌లో టీమిండియాకి పెద్దగా ఆశలు లేవు. అయితే వ్యక్తిగత స్టోక్ ప్లే  ఈవెంట్‌లో మూడు రౌండ్లు ముగిసేవరకూ టాప్ 2లో ఉన్న అదితి అశోక్, యావత్ భారతం దృష్టిని ఆకర్షించింది...

అయితే ఆఖరి రౌండ్‌లో కాస్త ఒత్తిడికి గురైన అదితి అశోక్... ఆఖరి షాట్‌ను మిల్లీమీటర్ తేడాతో మిస్ చేసుకుని, పతకాన్ని చేజార్చుకుంది. పతకం రాకపోయినా గోల్ఫ్‌లో టాప్ 4లో భారత ప్లేయర్ ఉండడం అంటే అసాధారణ ప్రదర్శనే.

అసలు గోల్ఫ్ అంటే ఎలా ఆడతారో కూడా తెలియని చాలామంది భారతీయులు, అదితి అశోక్ రెండో స్థానంలో ఉందని తెలిసి, టీవీల్లో ఆఖరి రౌండ్‌ను ఆసక్తిగా వీక్షించారు. ఇది అదితి అశోక్ సాధించిన ఘనతే.

రియో ఒలింపిక్స్‌లో 41వ స్థానంలో నిలిచిన 23 ఏళ్ల భారత గోల్ఫర్ అదితి అశోక్, ఈసారి 200వ ర్యాంకర్‌గా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టి అత్యుత్తమ ప్రదర్శనతో టాప్ సీడెడ్ ప్లేయర్లకు చెమటలు పట్టించింది... 
 

Follow Us:
Download App:
  • android
  • ios