భారత్-వెస్టిండిస్ ల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే భారత్ రెండు అద్భుత విజయాలు సాధించగా విండీస్ ఓ మ్యాచ్ లో గెలిచింది. వైజాగ్ లో ఉత్కంటభరితంగా సాగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఇలా సీరిస్ లో 2-1తో ఆధిక్యంలో వున్న భారత్ సీరిస్ గెలవాలంటే చివరి  మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిందే. దీంతో రేపు(గురువారం) కేరళలోని తిరువనంతపురం వేదికగా జరగనున్న చివరి వన్డేపై అభిమానుకు ఆసక్తి పెరిగింది. అంతే కాకుండా  కేరళ క్రికెట్‌ ఆసోసియేషన్‌(కేసీఏ) కూడా టికెట్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వడంతో ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. 

ఈ వన్డే మ్యాచ్‌ను వీక్షించాలనుకునే విద్యార్థులకు కేసీఏ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. వీరు తమ ఐడీ కార్డును చూపిస్తే ఆ టికెట్ ధరను 50శాతం తగ్గించి ధరకే ఇవ్వనున్నట్లు కేసీఏ అధికారులు తెలిపారు. విద్యార్థుల్లో క్రికెట్ పై వున్న ఆసక్తిని పెంచడానికి ఈ నిర్ణయం  తీసుకున్నట్లు కేరళ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది.

ఇక ఈ సీరీస్ లో నిర్ణయాత్మకంగా మారిన చివరి మ్యాచ్‌ను చూడటానికి అభిమానులు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో 40 వేల సీటింగ్ కెపాసిటీ గల ఈ స్టేడియంలో 30 వేల టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. మిగతా టికెట్లు కూడా వేగంగా అమ్ముడవుతున్నట్లు....రేపటివరకు మొత్తం టికెట్లు అమ్మకం పూర్తయి స్టేడియం ఫుల్లుగా అభిమానులతో నిండిపోయి ఉంటుందని కేసీఏ అధికారులు తెలిపారు. 

ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరుజట్లు తిరువనంతపురంకు చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. ముంబయి వన్డే మాదిరిగా ఇక్కడ కూడా భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలున్నట్లు పిచ్ పరిస్థితిని బట్టి తెలుస్తోందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వీరు చెప్పినట్లే జరిగితే మరోసారి అభిమానులు మ్యాచ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయనున్నారు.   


మరిన్ని వార్తలు    

ఆ అనుమానాలు ఇప్పుడు లేవు.. రాయుడిపై రోహిత్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా.. షోయబ్ ట్వీట్

కాల్పుల కేసులో శ్రీలంక మాజీ కెప్టెన్ అరెస్ట్...

ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు బద్దలుగొట్టిన రోహిత్....రెండూ సచిన్‌వే

ధావన్‌ను ఔట్ చేసి అతడి స్టైల్లోనే విండీస్ బౌలర్ సెలబ్రేషన్...

కోహ్లీకి అక్తర్ 120 సెంచరీల టార్గెట్

అలిగిన వార్నర్.. మ్యాచ్ మధ్యలో నుంచే వెళ్లిపోయాడు

సెలక్షన్ కమిటీ పై మండిపడుతున్న ధోని ఫ్యాన్స్