స్వతంత్ర్య భారతదేశంలో ఏ క్రికెట్ జట్టుకు సాధ్యం కాని అరుదైన ఘనత సాధించిన భారతీయ  క్రికెట్ జట్టును బిసిసిఐ అభినందించింది. కేవలం శుభాకాంక్షలతోనే సరిపెట్టకుండా ఈ విజయంలో పాలుపంచుకున్న ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి భారీ నజరానాలు ప్రకటించింది.   

బోర్డర్ గవాస్కర్ సీరిస్ ట్రోపిలో భాగంగా ఆస్ట్రేలియాను చిత్తు చేసి టెస్ట్ సిరిస్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ఒక్కొక్కరికి రూ.15లక్షల నగదును ప్రోత్సాహకంగా  అందించనున్నట్లు భారతీయ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. ఇక వీరితో పాటు జట్టులోని రిజర్వ్ ఆటగాళ్లకు రూ.7.5 లక్షలు అందించనున్నట్లు  బిసిసిఐ తెలిపింది.

పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును వారి స్వదేశంలోనే ఓడించేలా  ఆటగాళ్లకు శిక్షణనిచ్చిన టీంఇండియా కోచ్‌లకు ఆటగాళ్లకంటే ఎక్కువ మొత్తంలో బిసిసిఐ ప్రోత్సాహక నగదు అందించనుంది. ఒక్కో కోచ్ కి రూ. 25 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా మిగతా సహాయక సిబ్బందికి  కూడా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది.

ఆస్ట్రేలియా గడ్డపై 72ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోపి రూపంలో భారత జట్టు భారీ విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా జట్టును వారి దేశంలోనే మట్టికరిపించి టీంఇండియా ఈ ఘనత సాధించిన ఏకైక ఉపఖండ జట్టుగా నిలిచింది. దీంతో భారత జట్టుపై జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తాయి. 

ఇలా గతంలో దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాని ఘనత తాజాగా కోహ్లీ సేన సాధించింది. దీంతో భవిష్యత్ తరాలకు స్పూర్తిగా వుంటుందని జట్టు సభ్యులకు నగదు నజరానాలు ప్రకటించినట్లు బిసిసిఐ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

సొంత బౌలర్‌పై ఆసీస్ విమర్శలు.. వెనకేసుకొచ్చిన కోహ్లీ

టీంఇండియాపై ప్రశంసల వర్షం...పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో సహా

ఆటలోనే కాదు... టీంఇండియా సంబరాల్లోనూ దేశభక్తి....(వీడియో)

చారిత్రక విజయానందాన్ని భార్య అనుష్కతో పంచుకున్న కోహ్లీ...విక్టరీ వాక్ (వీడియో)

ఆసీస్ గడ్డపై భారత్ చారిత్రక విజయం.. బ్యాట్స్‌మెన్ల పాత్ర ఎంత..?

నటి ఈషా గుప్తాతో డేటింగ్ పై హార్దిక్ పాండ్యా స్పందన ఇదీ...

దుమారం: నోరు జారిన రవిశాస్త్రి

సగం.. సగం పనులు చేయకండమ్మా...ప్రీతిజింటాపై నెటిజన్ల ఫైర్