72 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై తొలిసారి ఆస్ట్రేలియాపై భారత్ టెస్ట్ సిరీస్ నెగ్గడంతో కోహ్లీసేనపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ఇతర ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోమవారం మ్యాచ్ ఫలితం వచ్చిన వెంటనే చాలా మంది సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.

అలాగే బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింటా కూడా భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసి.. తప్పులో కాలేశారు. ‘‘ఆస్ట్రేలియాపై టెస్ట్ మ్యాచ్ నెగ్గిన తొలి ఆసియా జట్టుగా రికార్డులకెక్కిన బాయ్స్ ఇన్ బ్లూకు అభినందనలు.

టీమిండియా విజయంలో చతేశ్వర పుజారా కీలకపాత్ర పోషించాడు అని ట్వీట్‌లో పేర్కొంది. దీనిపై క్రికెట్ అభిమానులు ఫైరయ్యారు. టెస్ట్ సిరీస్ నెగ్గితే టెస్ట్ మ్యాచ్ ఏంటీ..? బాయ్స్ ఇన్ బ్లూ అంటే అది వన్డే క్రికెట్‌లో టీమిండియా జెర్సీ కలర్.. . కానీ భారత్ నెగ్గింది టెస్ట్ మ్యాచ్‌లో.. ఈ ఫార్మాట్‌లో ఆటగాళ్లు వైట్ డ్రెస్ వేసుకుంటారని కూడా తెలియదా

అని ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే ఇలా సగం సగం పనులు చేయకండి అంటూ దుమ్మెత్తిపోశారు. అభిమానుల కామెంట్లతో కంగారుపడిన ప్రీతిజింటా కొద్దిసేపటికే ట్వీట్‌ను డిలీట్ చేసింది.
 

చారిత్రక విజయానందాన్ని భార్య అనుష్కతో పంచుకున్న కోహ్లీ...విక్టరీ వాక్ (వీడియో)

ఆసీస్ గడ్డపై భారత్ చారిత్రక విజయం.. బ్యాట్స్‌మెన్ల పాత్ర ఎంత..?

నటి ఈషా గుప్తాతో డేటింగ్ పై హార్దిక్ పాండ్యా స్పందన ఇదీ...

దుమారం: నోరు జారిన రవిశాస్త్రి