ఆస్ట్రేలియా జట్టును వారి స్వదేశంలోనే మట్టికరిపించి  టీంఇండియా  బోర్డర్ గవాస్కర్ ట్రోపిని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సీరిస్ గెలుపు ద్వారా టీంఇండియా  ఆటగాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. కేవలం స్వదేశంలో మాత్రమే టీంఇండియా పులి అని...విదేశాల్లో మాత్రం పిల్లిలా మారుతుందన్న విమర్శలకు ఈ గెలుపు ద్వారా పులి ఎక్కడైనా పులేనన్న సమాధానం ఇచ్చారు. 

ఇప్పటివరకు భారత దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాని విజయాన్ని 72 ఏళ్ళ సుధీర్ఘ నిరీక్షణ తర్వాత కోహ్లీ సేన సాధించింది. దీంతో ఈ చారిత్రక విజయ సంబరాలను ఆటగాళ్లు వివిధ రూపాల్లో జరుపుకుంటున్నారు. ఆట ముగిసిన తర్వాత గ్రౌం లో సంబరాలు జరుపుకున్న ఆటగాళ్లు...ఆ తర్వాత తాము బస చేసిన హోటల్లోను విజయోత్సవాన్ని జరుపుకున్నారు. 

హోటల్ కు విచ్చేసిన ఆటగాళ్లను అప్పటికే అక్కడకు చేరుకున్న అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అభిమానులతో కలిసి కెప్టెన్ కొహ్లీతో సహా ఆటగాళ్లంతా డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా బాలివుడ్ సినిమా ''పుకార్‌''లోని  ‘మేరీ దేశ్‌ కీ ధర్తీ సోనా ఉగ్‌లే...’దేశభక్తి పాటపై డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఈ వీడియోనే బిసిసిఐ అధికారిక ట్విట్టర్  లో పోస్ట్ చేసింది. 

ఈ వీడియోపై భారత క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చారిత్రాత్రమక విజయంతో దేశం  గర్వపడేలా చేసిన టీంఇండియా జట్టు తమ గెలుపు సంబరాలను కూడా ఇలా దేశభక్తితో జరుపుకోవడం చాలా గర్వించదగ్గ విషయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా భారత ఆటగాళ్లు హోటల్లో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. 

అంతకు ముందు భారత జట్టు సిడ్నీ గ్రౌండ్ లోనే డ్యాన్స్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కోహ్లీ తన భార్యతో కలిసి మైదానంలో విక్టరీ వాక్ చేశారు. ఇలా  వివిధ రూపాల్లో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
వీడియో