బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోవడంతో ఆసీస్ మాజీ క్రికెటర్లు అసహనంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో జట్టు ప్రధాన బౌలర్ మిచెల్ స్టార్క్‌పై విమర్శలు చేశారు. అతను తన స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన కనబరచలేదని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలను ఖండించిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. స్టార్క్‌కు అండగా నిలిచాడు. ఎంతోకాలంగా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న స్టార్క్.. ఒక సిరీస్‌లో సరిగా రాణించకపోతే విమర్శలు చేయడం దారుణమన్నాడు. ఇలాంటి సమయంలో స్టార్క్‌కు మద్ధతుగా ఉండాల్సింది పోయి ఇలా విమర్శలు చేయడం ఒక గొప్ప బౌలర్‌ను అవమానించడమేనని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

ఎంతో అనుభవమున్న స్టార్క్‌పై ఒత్తిడి పెంచి దూరం చేసుకోవద్దని, అతనికి కొంత స్వేచ్ఛను ఇవ్వాలని కోరాడు. తాజా టెస్ట్ సిరీస్‌లో స్టార్క్ 13 వికెట్లు తీశాడు. పేలవ ప్రదర్శన కారణంగా అతనిని భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు.. అయితే ఇది త్వరలో జరగనున్న యాషెస్ సిరీస్ కోసమేనని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు తెలిపాయి.

 

చారిత్రక విజయానందాన్ని భార్య అనుష్కతో పంచుకున్న కోహ్లీ...విక్టరీ వాక్ (వీడియో)

ఆసీస్ గడ్డపై భారత్ చారిత్రక విజయం.. బ్యాట్స్‌మెన్ల పాత్ర ఎంత..?

నటి ఈషా గుప్తాతో డేటింగ్ పై హార్దిక్ పాండ్యా స్పందన ఇదీ...

దుమారం: నోరు జారిన రవిశాస్త్రి

సగం.. సగం పనులు చేయకండమ్మా...ప్రీతిజింటాపై నెటిజన్ల ఫైర్