ఆస్ట్రేలియా గడ్డపై 72ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోపి రూపంలో భారత జట్టు భారీ విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా జట్టును వారి దేశంలోనే మట్టికరిపించి టీంఇండియా ఈ ఘనత సాధించిన ఏకైక ఉపఖండ జట్టుగా నిలిచింది. దీంతో భారత జట్టుపై జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మన దాయాది పాకిస్థాన్ దేశ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కూడా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఇమ్రాన్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ''ఆస్ట్రేలియా జట్టుపై వారి స్వదేశంలోనే టెస్ట్ సీరిస్ విజయాన్ని సాధించిన ఏకైక ఉపఖండ జట్టుగా నిలిచిన టీంఇండియాకు శుభాకాంక్షలు. అలగే ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ప్రత్యేక అభినందనలు'' అంటూ పాక్ ప్రధాని ట్వీట్ చేశారు. 

 

ఇక ఈ చారిత్రాత్మక విజయం  తర్వాత దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, భారత మాజీ క్రికెటర్ల నుండి టీంఇండియా శుభాకాంక్షలు అందుకుంది.  ఎవరెవరు ఎలా శుభాకాంక్షలు తెలియజేశారో తెలుసుందాం. 

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్:

ఆస్ట్రేలియా జట్టుపై మొదటిసారి టెస్ట్ సీరిస్ గెలిచి అంతిమ లక్ష్యాన్ని చేరుకున్న కోహ్లీ సేనకు శుభాకాంక్షలు. అద్భుతమైన బ్యాటింగ్, అంతకంటే అత్యద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ ఇలా మొత్తంగా జట్టు సమిష్టి కృషితో విజయం సాధించి దేశం గర్వించేలా చేశారన్నారు. ఇకపై కూడా ఇలాగే విజయాలను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. 

 

ప్రధాని నరేంద్ర  మోదీ:

ఆస్ట్రేలియాపై చారిత్రక విజయాన్ని అందుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు. బలమైన జట్టుకు గట్టి ఫోటి ఇచ్చిన టీంఇండియా ఈ విజయానికి అర్హమైనదిగా ఆయన  పేర్కొన్నారు. ఈ సీరిస్ విజయం టీంఇండియా ఆటగాళ్ల సమిష్టి పోరాటానికి మధురమైన జ్ఞాపకంగా నిలుస్తుందంటే మోదీ ట్వీట్ చేశారు. 

Best wishes for the various games ahead.

వైఎస్సార్ సిపి అధినేత జగన్:

ఆస్ట్రేలియా గడ్డపై మొదటి టెస్ట్ సీరిస్ విజయాన్ని సాధించిన టీంఇండియా జట్టుకు అభినందనలు. భారత దేశ ప్రజలందరూ గర్వించేలా ఈ విజయం ఉందని జగన్ పేర్కొన్నారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్:

భారత స్వాతంత్ర్యం తర్వాత ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయాన్ని అదుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు. ఈ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తో పాటు జట్టులోని ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన వల్లే ఈ విజయం సాధ్యమైందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.