భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను సాధించి టీంఇండియా ఆటగాళ్లు తమ సత్తా ఏంటో మరోసారి చాటుకున్నారు. ఆస్ట్రేలియా జట్టును వారి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఓడించి టెస్ట్ సీరిస్ ను కైవసం చేసుకున్న ఆటగాళ్లు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే ఎప్పుడూ ముందుండే కోహ్లీకి ఈ విజయం మరింత జోష్ ఇచ్చినట్లుంది. అందుకోసమే ఇతడు వివిధ రూపాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. 

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోపిని భారత జట్టు కైవసం చేసుకుంది. ఇలా ఆసిస్‌ను వారి స్వదేశంలోనే  ఓడించి తొలిసారి చారిత్రక టెస్టు సిరీస్‌ను విజయాన్ని అందుకున్న తరుణంలో డాషింగ్ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. విజయం అనంతరం సిడ్నీ గ్రౌండ్ లో సందడి చేశాడు. కోహ్లీ-అనుష్క జంట మైదానంలో కలియతిరుగుతూ అభిమానులకు అబివాదం చేశారు. వీరిని విక్టరీ వాక్ సందర్భంగా అభిమానులు కేరింతలతో గ్రౌండ్ దద్దరిల్లిపోయింది.

తమ అభిమాన ఆటగాడు భార్యతో  కలిసి గెలుపు సంబరాలు చేసుకుంటున్న వీడియోను విరాట్ కోహ్లీ అభిమానులు సోషల్ మీడియా మాద్యమాల్లో పెట్టారు. దీంతో ఆ వీడియో కేవలం కోహ్లీ అభిమానుల నుండే కాదు యావత్ క్రికెట్ అభిమమానులను ఆకట్టుకుంటోంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.   
  
నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగియడంతో గవాస్కర్‌ - బోర్డర్‌ ట్రోఫీని భారత్‌ 2-1తో సొంతం చేసుకుంది. ఫలితంగా ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ మొదలైన 1947-48 తర్వాత ఇలా వారి స్వదేశంలోనే  ఆసిస్‌ను ఓడించడం కేవలం కోహ్లీ సేనకే సాధ్యమైంది. 72 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని, గతంలో దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను కోహ్లి సేన సాకారం చేసింది. దీంతో ప్రస్తుతం కోహ్లీ సేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

వీడియో