చైనాలోని వుహాన్ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మిటన్ చాంపియన్‌షిప్ లో భారత ప్లేయర్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి  శ్రీకాంత్ లీగ దశ నుండే వెనుదిరగగా తాజాగా మహిళల సింగిల్స్ విభాగంలోనూ అదే ప్రదర్శన పునరావృతం అయ్యింది. హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్, పివి సింధులు కూడా క్వార్టర్ ఫైనల్ లోనే ఓటమిపాలయ్యారు. దీంతో భారత్ మెడల్ ఆశలు దాదాపు ఆవిరైపోయాయి. 

లీగ్ స్థాయిని దాటుకుని వచ్చిన హైదరాబాదీ షట్లర్ సైనా క్వార్టర్ ఫైనల్ ను మాత్రం అధిగమించలేకపోయింది. జపాన్ క్రీడాకారిణి అకానే యమగుచితో హోరాహోరీగా జరిగిని పోరులో చివరకు సైనా ఓటమిని చవిచూసింది. జపాన్ క్రీడాకారిణి చేతిలో సైనా 3-21, 23-21, 16-21 తేడాతో ఓటమిని చవిచూసి చాంపియన్‌షిప్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. 

ఇక 2016 రియో ఒలింపిక్ కాంస్య పతక విజేత పివి సింధు కూడా ఆశించిన మేరు ఆకట్టుకోలేకపోయింది. సింధు కూడా క్వార్టర్స్ లో చైనా క్రీడాకారిణి యాన్యాన్ చేతిలో 19-21,9-21 వరుస సెట్లలో ఓటమిపాలయ్యింది. 

ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో ఇప్పటికే శ్రీకాంత్ ఇంటిదారి పట్టగా సమీర్ వర్మ కూడా క్వార్టర్ ఫైనల్ లో ఓటమిపాలయయ్యాడు. ఇలా మహిళా, పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులేవ్వరు ఆశించిన మేర రాణించకపోవడంతో  ఈ చాంపియన్‌షిప్ లో భారత్ మెడల్ ఆశలు దాదాపు గళ్లంతయ్యాయి. 

సంబంధిత వార్తలు

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో శ్రీకాంత్ ఓటమి...తొలిరౌండ్‌లోనే ఇంటిముఖం