Search results - 105 Results
 • Free Test access to school children

  CRICKET25, Sep 2018, 8:04 PM IST

  ఉప్పల్ స్టేడియంలోకి ఉచిత ప్రవేశం... భారత్,వెస్టిండిస్ మ్యాచ్ సందర్భంగా

  మీరు ఏదైనా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటే వేలు పోసి టికెట్ కొనుక్కుని గ్రౌండ్ లోకి అడుగుపెట్టాలి. కొన్ని సందర్భాల్లో అలా వేలు పోసినా టికెట్లు దొరికే పరిస్థితి ఉండదు. కానీ వచ్చే నెల హైదరాబాద్ లో జరిగే టెస్టు మ్యాచ్ ని ఓ రోజు ఉచితంగా చూసే అవకాశాన్ని హైదరాబాద్ వాసులకు కల్పించింది హెచ్‌సీఏ. కానీ అందరికి కాకుండా కొన్ని షరతులు విధించింది. 

 • MS Dhoni returns to captaincy after two years

  CRICKET25, Sep 2018, 5:02 PM IST

  మ్యాచ్ టై: భారత్ ను వణికించిన అఫ్గానిస్తాన్

  ఆసియా కప్ లో భారత జట్టు మంచి పామ్ లో ఉంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచుల్లో టీంఇండియా అద్భుత విజయాలు సాధించింది. పాకిస్థాన్ వంటి స్ట్రాంగ్ జట్టును కూడా చిత్తుగా ఓడించి తనకు తిరుగలేదని నిరూపించుకుంది. ఇవాళ సూపర్ 4 లో బాగంగా అప్ఘాన్ జట్టుతో భారత్ చివరి మ్యాచ్ ఆడుతోంది. 

 • pak fans fires on captain sarfraj ahmed in social media

  CRICKET25, Sep 2018, 4:45 PM IST

  ''అంత్యంత సోమరి, బుర్రలేని, ప్రతిభ లేని కెప్టెన్ అతడు''

  ఆసియాకప్ లో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన పోరులో భారత్ అద్భుత విజయాలు సాధించింది. ఒకసారి కాదు జరిగిన రెండు మ్యాచుల్లోని పాకిస్థాన్ ను ఓడించి భారత జట్టు తిరుగులేని ఆదిపత్యాన్ని కొనసాగించింది. లీగ్ దశలో కాస్త పోరాటపటిమ కనబర్చిన పాక్ ఆటగాళ్లు సూపర్ 4 మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేశారు. ఇలా తమ జట్టు చిత్తుగా ఓడిపోవడాన్ని పాక్ అభిమానులు సహించలేకపోతున్నారు. అదీ భారత్ చేతుల్లో ఘోర పరాభవాన్ని పొందడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో జట్టు సభ్యులపై ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై పాక్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అతడి వల్లే పాక్ జట్టు సూఫర్ 4 లో ఓటమిపాలయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 • National archery coach Jiwanjot Singh Teja resigns

  SPORTS24, Sep 2018, 3:53 PM IST

  క్రీడా పురస్కారాల వివాదం : భారత జట్టు కోచ్ రాజీనామా

  భారత ప్రభుత్వం ప్రకటించిన క్రీడా పురస్కారాలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే తమకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు రాకపోవడంతో రెజ్లర్ భజరంగ్ పూనియా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇతడు ఏకంగా క్రీడా మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశాడు. ఇపుడు మరో అవార్డుపై వివాదం రేగుతోంది. ద్రోణాచార్య అవార్డు రాకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ ఆర్చరీ కోచ్ రాజీనామా చేశాడు. 

 • pakistan captain sarfraz ahmed comments

  SPORTS24, Sep 2018, 11:54 AM IST

  భారత్ అద్భుతంగా ఆడుతోంది..పాక్ ఇంకా టోర్నీలోనే ఉందని గుర్తుంచుకోండి: సర్ఫరాజ్

  ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ ప్రదర్శన పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్. సూపర్ 4లో భాగంగా రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత క్రికెటర్ల ప్రతిభ అపూర్వమని.. అయితే పాక్ ఇంకా టోర్నీ నుంచి నిష్క్రమించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించాడు

 • malaysia badminton player lee chong wei suffers nose cancer

  CRICKET23, Sep 2018, 6:16 AM IST

  ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి క్యాన్సర్... ‘‘మళ్లీ వస్తా’’

  మరో క్రీడాకారుడు క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడ్డాడు. మలేసియా దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లీ చాంగ్ వీ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ ఏడాది జులైలో లీ చాంగ్‌కు శ్వాస సంబంధమైన సమస్య ఏర్పడింది.

 • afghanistan vs pakistan drama-filled match

  CRICKET22, Sep 2018, 12:25 PM IST

  ఉత్కంఠగా సాగిన పాక్-అప్ఘాన్ మ్యాచ్... చివరి ఓవర్లో పాకిస్థాన్ గెలుపు

  ఆసియా కప్ లో అప్ఘానిస్తాన్ జట్టు సూపర్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇప్పటికే గ్రూప్ బి లో అగ్రస్థానంలో నిలిచి అప్ఘాన్ సంచలనం సృష్టించింది. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి అగ్రశ్రేణి జట్లను ఓడించి సూపర్ 4 కు చేరుకుంది. అయితే శుక్రవారం సూపర్ 4 లో బాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు ను కూడా ఓడించినంత పని చేసింది. అయితే చివరివరకు పోరాడిన పాక్ చివరి ఓవర్లో విజయం సాధించి గట్టెక్కింది.

 • National Sports Awards 2018 announced

  CRICKET20, Sep 2018, 6:06 PM IST

  కోహ్లీకి ఖేల్ రత్న ; శ్రీనివాస రావుకు ద్రోణాచార్య : సిక్కి రెడ్డికి అర్జున

  భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇటీవలే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు కోహ్లీతో పాటు వెయిట్ లిప్టర్ మీరాబాయి చాను నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు క్రీడాకారులకు 2018 సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో సత్కరిస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

 • Hardik, Axar & Shardul ruled out of Asia Cup

  CRICKET20, Sep 2018, 4:42 PM IST

  ఆసియాకప్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ... మరో ఇద్దరు ఆటగాళ్లు టోర్నీకి దూరం

  ఆసియాకప్ లో హాంకాంగ్, పాకిస్థాన్ జట్లుపై విజయం సాధించి టీంఇండియా మంచి జోరుమీదుంది. అయితే ఈ రెండు మ్యాచుల్లో విజయాలు సాధించి భారత జట్టు పామ్ లోకి వచ్చినట్లు భావిస్తున్న సమయంలో ఆటగాళ్ల గాయాలు భయపెడుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగా అతడు టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఈ టోర్నీ నుండి వైదొలుగుతున్నట్లు బిసిసిఐ ప్రకటించింది.

 • Team India players suffer for dubai temperature

  SPORTS20, Sep 2018, 1:48 PM IST

  దుబాయ్‌లో మండిపోతున్న ఎండలు.. ఐస్‌ బాక్స్‌లో తలపెట్టిన భారత క్రికెటర్లు

  ఆసియా కప్‌ కోసం దుబాయ్ వెళ్లిన భారత క్రికెటర్లకు అక్కడి ఎండలు మంట పుట్టిస్తున్నాయి. సుమారు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆటగాళ్లు అల్లాడిపోతున్నారు

 • team india player hardik pandya injured

  CRICKET19, Sep 2018, 7:33 PM IST

  పాకిస్థాన్‌ మ్యాచ్‌లో గాయపడ్డ హర్దిక్ పాండ్యా... స్ట్రెచర్ పై గ్రౌండ్ బయటకు తరలింపు

  ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో ఉత్కంటభరితంగా సాగుతున్న మ్యాచ్ లో టీంఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత ఆటగాడు హర్దిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్ కు దూరం కావాల్సి వచ్చింది. పాండ్యా బౌలింగ్ చేస్తూ గ్రౌండ్ లోనే కుప్పకూలడంతో వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అయినా పాండ్యా నడిచే పరిస్థితిలో లేకపోవడంతో స్ట్రెచర్ పై అతన్ని గ్రౌండ్ లోంచి బైటికి తీసువచ్చారు. 

 • team india vs pakistan match in asia cup

  CRICKET19, Sep 2018, 4:58 PM IST

  దాయాదుల మధ్య పోరు...హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

  ఆసియా కప్ లో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం సిద్దమైంది. క్రికెట్ ప్రేక్షకులకు ఈ దాయాదుల మధ్య పోరంటే ఎప్పుడూ ఆసక్తే. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న మ్యాచ్ కోసం ఎప్పుడో టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ స్టేడియంలోని మొత్తం 25 వేల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు ఆసియాకప్ నిర్వహకులు తెలిపారు. 
   

 • India vs pakistan match: sania mirza signout social media for few days

  CRICKET19, Sep 2018, 1:56 PM IST

  భారత్, పాక్‌లలో ఎవరికి సపోర్ట్ చేస్తారన్న నెటిజన్.. ట్విట్టర్‌కు టాటా చెప్పిన సానియా

  భారత టెన్నిస్ స్టార్ సానియాకు అరుదైన సమస్య వచ్చింది.. ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా పలువురు అభిమానులు సానియాపై ప్రశ్నల వర్షం కురిపించారు

 • Paksitan prime minister imran khan likely attend to india vs pakistan match in asia cup

  CRICKET19, Sep 2018, 12:58 PM IST

  ఆసియా కప్: భారత్-పాక్ మ్యాచ్‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..?

  చాలా సంవత్సరాలు తర్వాత భారత్-పాక్ మధ్య వన్డే జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాక్ అభిమానులు టీవీల ముందు రెడీ అయిపోయారు.

 • sourav ganguly comments on asia cup

  CRICKET18, Sep 2018, 4:41 PM IST

  కోహ్లీ లేకపోయినా టీంఇండియా ఉత్తమ జట్టే : సౌరవ్ గంగూలీ

  ఈ మధ్య టీంఇండయా బ్యాంటింగ్ విభాగంలో కెప్టెన్ విరాట్ కోహ్లీపై అతిగా ఆధారపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లాండ్ టూర్ లోనూ ఇదే జరిగింది. కోహ్లీ ఒక్కడే బ్యాంటింగ్ లో రాణించి 5 టెస్టుల సీరీస్ లో 440 పరుగులు సాధించి  మ్యాన్  ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఈ దరిదాపుల్లో కూడా ఏ ఇండియన్ బ్యాట్ మెన్ పరుగులు లేవు. దీంతో పలువురు మాజీలు విరాట్ పై ఇంతలా ఆధాపరపటం మంచిది కాదని సూచించారు. అలాగే ప్రతిష్టాత్మక ఆసియా కప్ కు భారత జట్టులో కోహ్లీని ఎంపిక చేయకుండా విశ్రాంతి నివ్వడంపై కూడా వారు తప్పుబట్టారు.