Asianet News TeluguAsianet News Telugu

130 ఏళ్ల చెత్త రికార్డును బద్దలు కొట్టిన షాన్ మార్ష్

బోర్డర్-గావస్కర్ ట్రోఫిలో భాగంగా భారత్‌తో అడిలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ అరుదైన చెత్త మైలురాయిని అందుకున్నాడు. భారత్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.

shaun marsh breaks 130 Year old record
Author
Adelaide SA, First Published Dec 7, 2018, 4:43 PM IST

బోర్డర్-గావస్కర్ ట్రోఫిలో భాగంగా భారత్‌తో అడిలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ అరుదైన చెత్త మైలురాయిని అందుకున్నాడు. భారత్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.

బ్యాటింగ్‌లో ఉన్న షాన్ మార్ష్ అశ్విన్ వేసిన బంతిని ఆడగా... బ్యాట్ అంచును తాకిన బాల్ గింగిరాలు తిరుగుతూ వెళ్లి వికెట్లను పడగొట్టింది. దీంతో రెండు పరుగుల వద్ద మార్ష్ పెవిలియన్‌కు చేరాడు.

ఈ నేపథ్యంలో షాన్ మార్ష్ ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మార్ష్ ఇలా సింగిల్ డిజిట్‌కే వెనుదిరగడం వరుసగా ఇది ఆరోసారి. కాగా, 1888 తర్వాత ఆసీస్ టాప్-5 ఆటగాళ్లు ఎవరూ వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కి ఔటవ్వలేదు.

పూర్ ఫామ్ కారణంగా మాజీలతో పాటు, ఆస్ట్రేలియా అభిమానులు షాన్ మార్ష్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. గత 13 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్కసారి కూడా 40కి మించి పరుగులు చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. వరుసగా వికెట్లు పడుతున్నా ట్రేవిస్ హెడ్ 61 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. 

అడిలైడ్ టెస్ట్: ట్రేవిస్ ఒంటరిపోరు, ఆసీస్ 191/7

ఓటుహక్కు వినియోగించుకున్న పీవీ సింధూ, గోపీచంద్

తెలంగాణ ఎన్నికలు.. గుత్తా జ్వాల ఓటు గల్లంతు

82 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టిన పాక్ క్రికెటర్

ఆడటం వచ్చా..టీమిండియా చెత్త బ్యాటింగ్‌పై గావస్కర్ ఫైర్

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. పుజారా ఖాతాలో రెండు అరుదైన రికార్డులు

వికెట్ పారేసుకున్న రోహిత్... మాజీలు, అభిమానుల ఆగ్రహం

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన గంభీర్...



 

Follow Us:
Download App:
  • android
  • ios