బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 191/7 వద్ద రెండో రోజు ఆట ముగించింది.  భారత బౌలర్ల ధాటికి ఆసీస్ పరుగులు చేయడం కష్టంగా మారింది. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ట్రేవిస్ హెడ్ సంయమనంతో ఆడి ఒంటరిపోరు చేశాడు. 

అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 250/9తో రెండో ఇన్నింగ్సును ప్రారంభించిన భారత్‌ పరుగులేమి చేయకుండానే అలౌటైంది. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో మహ్మద్ షమీ పెవిలియన్ చేరడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 

ఓపెనర్ ఫించ్.. ఇషాంత్ బౌలింగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మార్కస్ హారీస్, ఉస్మాన్ ఖవాజా జోడీ ఇన్నింగ్సును చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కుదురుకుంటున్న దశలో అశ్విన్ ఈ జంటను వెంట వెంటనే పెవిలియన్ చేర్చాడు.

ఆ తర్వాత వచ్చి షాన్ మార్ష్ కూడా అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. అయితే హ్యాండ్స్‌కోంబ్, ట్రావీస్ హెడ్‌లు కలిసి ఆచితూచి ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచారు. అయితే బుమ్రా హ్యాండ్స్‌కోంబ్‌‌ను అవుట్ చేయడంతో ఈ జోడికి తెరపడింది.

ట్రేవిస్‌తో కలిసి కమ్మిన్స్ కాసేపు నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినప్పటికీ బుమ్రా బౌలింగ్‌లో కమ్మిన్స్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఆసీస్ 88 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. ట్రేవిస్ హెడ్ 61, మిచెల్ స్టార్క్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 3,ఇషాంత్, బుమ్రా తలో 2 వికెట్లు పడగొట్టారు.

 

ఓటుహక్కు వినియోగించుకున్న పీవీ సింధూ, గోపీచంద్

తెలంగాణ ఎన్నికలు.. గుత్తా జ్వాల ఓటు గల్లంతు

అడిలైడ్ టెస్ట్: 250 పరుగులకు భారత్ అలౌట్, ఆసీస్ 35/1

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. పుజారా ఖాతాలో రెండు అరుదైన రికార్డులు

అడిలైడ్ టెస్ట్: పుజారా ఒంటరి పోరు, తొలి రోజు భారత్ 250/9

వికెట్ పారేసుకున్న రోహిత్... మాజీలు, అభిమానుల ఆగ్రహం