తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో పలువురు కీడాకారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్మాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ లు తమ కుటుంబసభ్యులతో పోలింగ్ కేంద్రానికి వచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాము తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని.. అదేవిధంగా ప్రజలంతా కూడా ఓటు వేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు మాత్రం గల్లంతయ్యింది. దీంతో.. ఆమె నిరాశతో ఇంటికి వెనుదిరిగారు. 

శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.