భారత జట్టుకు ఓపెనర్ విశిష్ట సేవలందించిన గౌతమ్ గంభీర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. టీంఇండియాకు ప్రతిష్టాత్మక విజయాలు అందించిన కొంత కాలంగా జట్టులో స్థానం కోల్పోడంతో దూరంగా ఉంటున్నాడు. అయితే  దేశ వాళీ క్రికెట్, ఐపీఎల్ లీగుల్లో రాణిస్తే మళ్లీ పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఇలా అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెట్ అభిమానులనే  కాదు విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

మంగళవారం ఆకస్మాత్తుగా అన్ని క్రికెట్‌ ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు గంభీర్ తన అధికారిక ట్విటర్‌లో ప్రకటించాడు. బరువెక్కిన హృదయంతో తన జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారంటూ గంభీర్ కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో తన రిటైర్మెంట్ ను ప్రకటిస్తున్నట్లు గంభీర్ ట్వీట్ చేశాడు. 

అయితే రంజీ ట్రోపీలో భాగంగా ఢిల్లీ-ఆంధ్రా జట్ల మధ్య ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగే మ్యాచే గంభీర్ ఆడే చివరి మ్యాచ్ కానుందని తెలుస్తోంది.  మొత్తానికి 2016 లో చివరి టెస్ట్, 2013 లో చివరి వన్డే ఆడిన గంభీర్  ను మళ్లీ భారత జట్టులో చూడలేమంటూ అభిమానులు కూడా ఆవేధన వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.