రికార్డులు ఉన్నది బద్దలు కావడానికే అని చాలా మంది అంటూ ఉంటారు. కాస్త సమయం తీసుకున్నా ఏ నాటికైనా ఆ రికార్డును ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారు. క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఉదంతాలు ఎన్నో. తాజాగా 82 ఏళ్లపాటు నిలిచియున్న అరుదైన రికార్డును పాక్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా బద్ధలు కొట్టాడు.

టెస్టుల్లో అత్యంత వేగంగా రెండు వందల వికెట్లు సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో యాసిర్ షా ఈ ఘనతను సాధించాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ విలియమ్ సోమర్‌విల్లేను ఔట్ చేయడం ద్వారా యాసిర్ ఈ ఘనతను అందుకున్నాడు. 82 ఏళ్ల క్రితం 1936లో ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రిమ్మెట్ రెండోందల వికెట్ తీశాడు. ఆయన తన 36వ టెస్టులో ఈ ఘనత సాధించగా.. యాసిర్ షా కేవంల 33వ టెస్టుతోనే ఈ మార్క్ అందుకున్నాడు.