తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఓటు వేయడానికి వచ్చిన  ప్రముఖ బ్మాడ్మిటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాలా నిరాశకు గురయ్యారు. ఓటర్ల జాబితాలో గుత్తా జ్వాలా పేరు గల్లంతయ్యింది. గుత్తా జ్వాలా ఈ రోజు ఉదయం హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్  పోలింగ్ కేంద్రానికి వచ్చారు.

ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆమె నిరాశగా తిరిగి వెళ్లిపోయారు. కేవలం గుత్తాజ్వాల ది మాత్రమే కాకుండా.. చాలా మంది ఓటర్ల ఓట్లు గల్లంతయ్యాయి. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చి..తమ పేరు కనిపించకపోవడంతో చాలా మంది వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. 

శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.