ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి వన్డేలో టీంఇండియా బ్యాట్ మెన్ రోహిత్ శర్మ ఆటతీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. జట్టు తక్కువ పరుగులకు వికెట్ల కోల్పోయి కష్టాల్లో వున్న సమయంలో రోహిత్ ఆదుకోడానికి ప్రయత్నించకుండా హిట్టింగ్ కు ప్రాధాన్యత నిచ్చి ఔటయ్యాడు. ఇలా నిర్లక్ష్యంగా ఆడిన అతడిపై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఆస్ట్రేలియా వేదికగా టీంఇండియా, ఆసీస్ జట్లు మధ్య ఇవాళ మెదటి టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన  భారత బ్యాట్ మెన్స్ ఆసీస్ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయారు. కేవలం 41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును రోహిత్ శర్మ ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు 61 బంతుల్లో 37 పరుగులు చేశాడు. 

అయితే కాస్త సంయమనంతో ఆడుతూ జట్టును కష్టాల్లోంచి గట్టెకిస్తాడని అందరూ భావిస్తే...రోహిత్ మాత్రం భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరాడు. దీంతో మాజీలు , క్రికెట్ వ్యాఖ్యాలతో పాటు అభిమానులు రోహిత్ ఆటతీరుపై ట్విట్టర్ వేదికన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

రోహిత్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్  ట్వీట్ చేశారు. రోహిత్ తన కెరీర్ లో వచ్చిన అరుదైన అవకాశాలను ఒడిసిపట్టుకోవాలని సూచించారు. కానీ ఇలా నిర్లక్ష్యంగా ఆడి వాటిని జారవిడుచుకోవద్దని సలహా ఇచ్చారు. ఇక మరో వ్యాఖ్యాల హర్షా భోగ్లే కాస్త వ్యంగ్యంగా స్పందించారు. '' రోహిత్ కొన్ని షాట్లను చాలా మెరుగ్గా ఆడాడు...కానీ వాటిని మళ్లీ మళ్లీ ఆడి రిప్లేలా ప్రదర్శించాలనుకోవద్దని కోరుతున్నాను'' అంటూ హర్షా ట్వీట్ చేశారు. ఇక కొందరు అభిమానులయితే రోహిత్ ఆటతీరు, ఔటైన విధానంపై కాస్త ఘాటేగానే స్పందించారు.