ముంబై వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండింట్లోనూ రాణించి విండీస్ జట్టును మట్టికరిపించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సీరిస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. 

భారత బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, అంబటి రాయుడు సెంచరీలతో రాణించగా బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ లు మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇలా భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో విండీస్ ఏ దశలోనూ భారత్ కు పోటీకి నిలవలేక పోయింది. కేవలం 153 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో భారత్ 224 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

కాస్త నిలకడగా ఆడుతూ జట్టును ఆదుకుందామని ప్రయత్నించిన విండీస్ ఆటగాడు శ్యామూల్స్ కూడా ఔటయ్యాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి శ్యామూల్స్ ఔటయ్యాడు. దీంతో విండీస్ 56 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ వరుసగా 3 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ 1 వికెట్ తీశాడు. మిగతా రెండు రనౌట్లు. ప్రస్తుతం హోల్డర్, అలెన్ బ్యాటింగ్ చేస్తున్నారు.

భారత బౌలర్ల దాటికి  విండీస్ బ్యాట్ మెన్స్ విలవిల్లాడిపోతున్నారు. కేవలం 12 ఓవర్లలోనే విండీస్ జట్టు సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 378 పరుగుల లక్ష్యానికి తగ్గట్లు విండీస్ బ్యాటింగ్ సాగడం లేదు. కేవలం 54  పరగులకే విండీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. 

భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన విండీస్ జట్టుకు భారత్ ఆదిలోనే షాకిచ్చింది. అద్భుతమైన బౌలింగ్ తోడు కళ్లుచెదిరే పీల్డింగ్ తో భాతర ఆటగాళ్లు విండీస్ పనిబడుతున్నారు. కేవలం 20 పరుగులకే మూడు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బ తీశారు. ఈ మూడిట్లో రెండు రనౌట్లే ఉన్నాయి. మొదట ఓపెనర్ హేమరాజ్ ను భవనేశ్వర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత హోప్స్ ను  కుల్దీప్, పావెల్ ను కోహ్లీ రనౌట్ చేశారు. ప్రస్తుతం శ్యామూల్స్, హెట్మెయర్ బ్యాటింగ్ చేస్తున్నారు. విండీస్ ఎనిమిది ఓవర్లలో కేవలం 3  వికెట్లు కోల్పోయి 33పరుగులు చేసింది. 

టీంఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, అంబటి రాయుడు చేలరేగి సెంచరీలు బాదడంతో భారత్ 377 పరుగులు సాధించింది.  విండీస్ బౌలర్లను చితగ్గొడుతూ రోహిత్ శర్మ 137 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 162 పరుగులు, అంబటి రాయుడు 81 బంతుల్లోనే సెంచరీ సాధించారు. అలాగే ధావన్ 38, కోహ్లీ 16, ధోని 23 పరుగులు చేశారు. చివరి ఓవర్లలో జాదవ్ కేవలం 7 బంతుల్లోనే 3 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేయగా జడేజా 4 బంతులాడి 7 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో రోచ్ 2, పాల్ 1, నర్స్ 1 వికెట్ పడగొట్టారు. 

ముంబై వన్డేలో అంబటి రాయుడు అద్భుత సుంచరీని సాధించాడు. రోహిత్ శర్మతో కలిసి విండీస్ బౌలర్లను ఉతికారేసిన రాయుడు రోహిత్ ఔటయ్యాడు కూడా జోరు తగ్గించలేదు. దీంతో కేవలం 81 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అయితే సెంచరీ సాధించిన వెంటనే రాయుడు  రనౌటయ్యాడు. దీంతో భారత్ 344 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ కు వచ్చినా  ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పోయాడు. దీంతో 355 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో జాదవ్, జడేజా ఉన్నారు.

రోహిత్ శర్మను పెవిలియన్ పంపించడంలో ఎట్టకేలకు వెస్టిండీస్ సఫలమైంది. రోహిత్ శర్మ 137 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 162 పరుగులు చేసి పాల్ బౌలింగులో అవుటయ్యాడు. దాంతో భారత్ 312 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

వెస్టిండీస్ పై జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచులో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. వన్డేల్లోో అతనికి ఇది 21వ సెంచరీ. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో ఇది రెండోది. అతనికి అంబటి రాయుడు నిలకడగా ఆడుతూ మంచి తోడ్పాటు అందిస్తూ అర్థ సెంచరీ పూర్తి చేశాడు.

గత మూడు వన్డేల్లో వరుస సెంచరీలు చేసిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో మాత్రం 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో 101 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది.

వెస్టిండీస్ పై జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచులో 71 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పావెల్ కు క్యాచ్ ఇచ్చి పాల్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మాట లేకుండా బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించాడు.

ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు వన్డేల్లో భారత్, వెస్టిండీస్‌లు చెరో మ్యాచ్ గెలవగా.. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో గెలిచి పై చేయి సాధించాలని ఇరు జట్లు నిర్ణయించుకున్నాయి. దీంతో ముంబై వన్డే హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.