భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఒంటరి పోరాటం వృధా అయింది. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడంతో భారత్ వెస్టిండీస్ పై శనివారం జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. వెస్టిండీస్ 43 పరుగులతో తేడాతో విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది. ఇప్పటి వరకు జరిగిన మూడో వన్డేల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి. విశాఖ వన్డే మ్యాచ్ టై అయింది. మరో రెండు వన్డేలు మిగిలి ఉన్నాయి.

284 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ చతికిలపడింది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, ధోనీ స్వల్ప  స్కోర్లకు అవుట్ కావడంతో పరాజయం తప్పలేదు. విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భారత్ 47.4 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలవుటైంది. శామ్యూల్ విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేయడంతోనే భారత్ ఓటమి దాదాపుగా ఖాయమైంది. శామ్యూల్ మూడు వికెట్లు తీసుకోగా హోల్డర్, మెక్ కాయ్, హోల్డర్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. రోచ్ కు ఒక వికెట్ దక్కింది.

225 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. చాహల్ 3 పరుగులు చేసి అవుటయ్యాడు. భారత్ ఖాయమైంది. 237 పరుగుల వద్ద భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 119 బంతుల్లో 107 పరుగులు చేసి శామ్యూల్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ విజయంపై ఆశలు సన్నగిల్లాయి. 220 పరుగుల భారత్ విరాట్ కోహ్లీ రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. మరో 50 బంతుల్లో 63 బంతుల్లో 63 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది.

వరుసగా వికెట్లు పడుతున్నా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ల వద్ద పాతుకుపోయాడు. ఓ వైపు వికెట్లు పడుతుంటే అతనిపై ఒత్తిడి పెరిగింది. 215 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ 10 పరుగులు చేసి ఔటయ్యాడు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేశాడు. వరుసగా అతను సెంచరీ బాదడం ఇది మూడోసారి. వన్డేల్లో అతనికి ఇది  వరుసగా మూడో సెంచరీ సాధించిన భారత బ్యాట్స్ మన్ గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. 110 బంతుల్లో 100 పరుగులు చేశాడు.

మూడో వన్డే మ్యాచులో కూడా ఎంఎస్ ధోనీ నిరాశపరిచాడు. 11 బంతులు  ఆడి 7 పరుగులు చేసి హోల్డర్ బౌలింగులో హోప్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో భారత్ 194 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. భారత్ 135 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అంబటి రాయుడు 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మూడో వికెట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. అంతకు ముందు శిఖర్ ధావన్ 35 పరుగులు చేసి నర్స్ బౌలింగులో ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. 172 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ 24 పరుగులు చేసి నర్స్ బౌలింగులో వెనుదిరిగాడు.

వెస్టిండిస్ నిర్దేశించిన 283 పరగుల లక్ష్యాన్ని చేదించడానికి బరిలో దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో కేవలం రెండు ఓవర్లలోనే భారత్ 9 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. 

పూణేలో  జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 283 పరగులు చేసింది. విండిస్ ఆటగాళ్లలో హోప్స్ 95, హెట్మెయర్ 37, హోల్డర్ 32, ఎఆర్ నర్స్ 40 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4, కుల్దీప్ 2, భువనేశ్వర్, చాహల్, ఖలీల్ అహ్మద్ లు తలో వికెట్ పడగొట్టారు. 

మరోసారి సెంచరీ వైపు దూసుకువచ్చిన విండిస్  ఆటగాడు హోప్స్ 5 పరుగుల తేడాతో సెంచరీ మిసయ్యాడు. 113 బంతుల్లో 95 పరుగులు చేసిన హోప్స్ చివరకు బుమ్రా బౌలింగ్ లో ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

పూణే వన్డేలో ఓ వైపు  విండిస్ బ్యాట్ మెన్స్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పడుతున్నా హోప్స్ మాత్రం జోరు తగ్గించ లేదు.  అతడికి కాస్త సహకారం అందించిన హోల్డర్ 32 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటవెంటనే విండీస్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో 217 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. హోప్స్ చెలరేగడంతో విండీస్ 43 ఓవర్లలో 225 పరుగులు చేసి 7 వికెట్ల కోల్పోయి బ్యాటింగ్ కొనసాగిస్తోంది.  

130 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. వైజాగ్ వన్డే మాదిరిగా ఆదుకుంటాడనుకుంటే హెట్మెయర్ ఇప్పటికే ఔటయ్యాడు. అయితే హోప్స్ 43 పరుగులు చేసి ఇంకా క్రీజులో వుండటం విండీస్ కు కాస్త దైర్యాన్నిచ్చింది. నాలుగో వికెట్ రూపంలో హెట్మెయర్ వెనుదిరగ్గా క్రీజులోకి వచ్చిన పావెల్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. కుల్దీప్ బౌలింగ్ లో రోహిత్ శర్మ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 28 ఓవర్లలో విండీస్ 138 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. 

మూడో వన్డేలో ధోనీ మరొసారి అద్భుతం చేశాడు. మరోసారి చెలరేగి ఆడుతూ వేగంగా పరగులు సాధిస్తున్న విండీస్ హిట్టర్ హెట్మెయర్ ను స్టంపౌంట్ చేశాడు. వేగంగా పరుగులు సాధించే క్రమంలో భారీ  షాట్ కు ప్రయత్నించిన హెట్మెయర్ ముందుకెళ్లి ఆడి వికెట్ సమర్పించుకున్నాడు.  కుల్దీప్ బౌలింగ్ లో ధోనీ అద్భుతంగా స్టంపౌట్ చేశాడు. దీంతో విండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. హెట్మెయర్ కేవలం 21 బంతుల్లోనే  37 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు వున్నాయి.  

వెస్టిండిస్ తో జరిగిన టెస్ట్ సీరిస్ ను సునాయాసంగా కైవసం చేసుకున్న టీంఇండియాకు ఇక వన్డేలో అసలే పోటీయే లేదని అందరూ భావించారు. అనుకున్నట్లే గౌహతిలో జరిగిన మొదటి వన్డేలో విండీస్ ఆటతీరు అలాగే సాగింది. అయితే వైజాగ్ లో జరిగిన రెండో వన్డేలో మాత్రం ఆ అభిప్రాయం తప్పని విండీస్ టీం భారత జట్టుకు గట్టి హెచ్చరిక చేసింది. దీంతో పూణేలో జరుగుతున్న మూడో వన్డే రసవత్తరంగా మారింది.

వైజాగ్ లో జరిగిన మ్యాచ్ లో వెస్టిండిస్ 322 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించినంత పని చేసింది. కానీ చివరకు మ్యాచ్ టైగా ముగియడంతో కోహ్లీ సేన ఊపిరిపీల్చుకుంది. విండీస్ బ్యాట్ మెన్స్ హెట్మెయర్, హోప్స్ అద్భుతంగా ఆడి ఓటమి నుండి తప్పించారు.

ఇక తాజాగా ఇవాళ జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ కు దిగిన విండీస్ మళ్లీ తడబాటుకు గురైంది. ఓపెనర్లు పోవెల్(21 పరుగులు), హేమరాజ్ (15 పరుగులు) చేసి ఔటయ్యారు. ఆ తర్వాత కాస్సేపటికే మార్కోన్ శ్యామూల్స్(9 పరుగుల) కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో విండీస్ కేవలం 13 ఓవర్లలోనే 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 

మరిన్ని వార్తలు

విశాఖ పిచ్‌పై పూజలు... చీఫ్ సెలెక్టర్‌ ఎమ్మెస్కేపై విమర్శలు

వైజాగ్ వన్డేలో సచిన్ రికార్డును బద్దలుగొట్టిన కోహ్లీ

విశాఖ వన్డే టై: హోప్ అద్భుతమైన బ్యాటింగ్

ధోనీ, కోహ్లీ, రోహిత్‌లను నిలబెట్టిన ‘‘విశాఖ’’

ధోనీ లా ఒకరోజు గడపాలని ఉంది.. పాక్ మహిళా క్రికెటర్ సనామీర్

రోహిత్ మరో సిక్స్ కొడితే సచిన్ రికార్డు బద్దలు....

''వీల్‌చైర్లో ఉన్నా ధోనిని బరిలోకి దించుతా''