పైనుంచి జోరున వర్షం కురుస్తోంది. ఆటగాళ్లంతా మైదానాన్ని వీడారు. కానీ ఆ అంఫైర్ మాత్రం ఆ వర్షంలో తడుస్తూనే తన పనిలో నిమగ్నమయ్యాడు. చివరకు థర్డ్ అంపైర్ నుండి నిర్ణయం వెలువడ్డాకే మైదానాన్ని వీడాడు. ఇలా తన వృత్తిపట్ల ఇంత నిబద్దత ప్రదర్శించి ఆ అంపైర్ పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. 

ఈ సంఘటన కొలంబో వేదికగా జరుగుతున్న శ్రీలంక-ఇంగ్లాడ్ మ్యాచ్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 367 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచుంది. ఈ క్రమంలో లక్ష్యచేధనకు బరిలో దిగిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం మొదలైంది. అయితే సన్నగా చినుకులు కురుస్తుండటంతో అంపైర్లు ఆటను కొనసాగించారు.  27 ఓవర్ లో ఇంగ్లాండ్ బ్యాట్ మెన్ ప్లంకెట్ ను కాలికి బంతి తగలడంతో బౌలర్ ధనుంజయ అప్పీలు చేశాడు.దీంతో అంఫైర్ అలీంధార్ ఔటిచ్చాడు.

ఈ  నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్లంకెట్ రివ్యూ కోరాడు. సరిగ్గా ఇదే సమయంలో వర్షం జోరందుకుంది. దీంతో మైదానంలోని ఆటగాళ్లందరూ మైదానాన్ని వీడారు. కానీ అంపైర్ అలీందార్ మాత్రం థర్డ్ అంఫైర్ నిర్ణయం కోసం గ్రౌండ్ లోనే నిల్చున్నాడు. చివరకు కాస్సేపటి తర్వాత థర్డ్ అంఫైర్ నిర్ణయం వెలువడటంతో మైదానం నుండి పెవిలియన్ కు చేరాడు.

ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంపైరింగ్ పట్లు అలీందార్ చూపించిన నిబద్దతను క్రికెట్ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి అఫైర్ల వల్ల కూడా క్రికెట్ పై మరింత అభిమానం పేరుగుతోందని పలువురు కామెంట్ చేశారు.