ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జాన్ హేస్టింగ్స్.. అరుదైన జబ్బుతో బాధపడుతున్నాడు. దీంతో.. ఆయన తనకు ఎంతో ఇష్టమైన ఆటను వదులుకోవాల్సి వచ్చింది. ఆయన క్రికెట్ కి గుడ్ బై చెప్పేశారు. క్రికెట్ కంటిన్యూ చేస్తే.. ఆయన చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో.. జాన్.. క్రికెట్ కి వీడ్కోలు పలికారు.

జాన్ బౌలింగ్ చేస్తున్న ప్రతిసారీ.. అతని ఉపిరితిత్తుల్లో రక్తస్రావం జరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దాదాపు నెల రోజుల క్రితం నుంచి అతనికి ఇలా జరుగుతోంది. రన్నింగ్, రోయింగ్, ఫిట్ నెస్ ట్రైనింగ్ వంటి ఎన్ని ఎక్సర్ సైజ్ లు చేసినా  ఇబ్బంది కలగడం లేదట. కేవలం బౌలింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఊపరితిత్తుల్లో నుంచి రక్త స్రావం జరుగుతోంది. 

దీంతో.. దీనిని అరుదైన జబ్బుగా పరిగణించారు. చాలా వైద్య పరీక్షలు నిర్వహించినప్పటికీ వ్యాధిపై స్పష్టత రాలేదని వైద్యలు చెప్పారు. ఇలానే బౌలింగ్ కంటిన్యూ చేస్తే చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో జాన్ తన ఆటకు పూర్తి గా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా తరపున ఒక టెస్టు, 29 వన్డేలు, 9 టీ20 మ్యాచ్ లు ఆడిన జాన్.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడరస్ జట్టులో కీలక పాత్ర పోషించాడు.