సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ లో నెలకొల్పిన ఎన్నో అరుదైన రికార్డులను టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కోటిగా అధిగమిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగుల మైలురాయిని అత్యంత తక్కువ ఇన్సింగ్సుల్లో సాధించిన సచిన్ రికార్డును కోహ్లీ బద్దలుగొట్టాడు. ఇలా ప్రస్తుతం కోహ్లీ ఆటతీరును చూస్తే సచిన్ రికార్డులే కాదు అంతర్జాతీయ రికార్డులన్నీ బద్దలవడం కాయమని క్రికెట్ అభిమానులు,క్రికెట్ విశ్లేషకులు ప్రకటిస్తున్నారు. కానీ మాస్టర్ మ్లాస్ట్ర్ కు చెందిన ఆ ఒక్క రికార్డును అధిగమించడం కోహ్లీ అసాధ్యం అంటూ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత జట్టు తరపున బ్యాటింగ్ చేస్తూ అద్భుతాలు సృష్టించగల సత్తా కోహ్లీకి ఉంది.  ఇప్పటివరకు ఏ భారత ఆటగాడికి సాధ్యం కాని అరుదైన రికార్డులు కోహ్లీ ఖాతాలో చేరాయి. అందులో చాలా రికార్డులు గతంలో సచిన్ పేరిట ఉండగా తాజాగా అవి కోహ్లీ పేరుకు మారాయి. అయితే ఇలా ఎన్ని రికార్డులను బద్దలుగొట్టినా సచిన్ మాదిరిగా 200  టెస్టులాడిని రికార్డును కోహ్లీ అధిగమించలేడని సెహ్వాగ్ తెలిపాడు. 

కోహ్లీ వయసును బట్టి చూస్తే అది అసాధ్యంగా కనిపిస్తోందన్నారు. కనీసం ఇప్పటినుండి 24 సంవత్సరాల పాటు కోహ్లీ విరామం లేకుండా టెస్టుల్లో ఆడితేనే అది  సాద్యమవుతుందన్నాడు.  కోహ్లీకే కాదు 200 టెస్టులాడటం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ క్రికెటర్‌కైనా సాధ్యం కాని పనేనంటూ సెహ్వాగ్‌ తెలిపాడు. కోహ్లీ ఇప్పటివరకు 73 టెస్టులాడాడు.  సచిన్ 200 టెస్టుల రికార్డును అధిగమించాలంటే అతడు ఇంకా 127 టెస్టులు ఆడాల్సి ఉంటుంది.