మోదీ, మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు... ప్రధానితో వీడియో కాన్ఫిరెన్స్‌పై అథ్లెట్ల స్పందన ఇది...
ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న భారత అథ్లెట్లతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా భేటీ అయిన ప్రధాని మోదీ...
అథ్లెట్లతో వారి తల్లిదండ్రులతో చర్చించి, శిక్షణా ఏర్పాట్ల గురించి తెలుసుకున్న ప్రధాని...
టోక్యో ఒలింపిక్స్‌కి బయలుదేరి వెళ్లే భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ, వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా చర్చించిన విషయం తెలిసిందే. టోక్యోలో జరిగే విశ్వక్రీడల కోసం ఎలా సన్నద్ధం అవుతున్నదీ, శిక్షణ ఎలా జరుగుతుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తదితర విషయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు మోదీ.
టోక్యో ఒలింపిక్స్‌కి 10 రోజులు మాత్రమే ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడడం, తమలో ఆత్మవిశ్వాసాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపిందని అంటున్నారు అథ్లెట్లు. ప్రధానితో భేటీ తర్వాత తమ స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు...
భారత సీనియర్ బాక్సర్ మేరీ కోమ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆర్చర్ దీపికా కుమారి, స్పింటర్ ద్యూటీ చంద్... తదితరులు సోషల్ మీడియా ద్వారా ప్రధానితో భేటీ గురించి ట్వీట్లు చేశారు...