టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్  మరోసారి అభిమానం చాటుకున్నాడు. గతంలో పలుమార్లు ధోనీపై ప్రశంసలు కురిపించిన డివిలియర్స్... తాజాగా మరోసారి అభిమానం  చాటుకున్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన రీ ఎంట్రీ గురించి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2023లో జరిగే ప్రపంచకప్‌లో తిరిగి ఆడుతారా..? అని డివిలియర్స్‌ని ప్రశ్నించగా.. ‘ఎంఎస్ ధోని అప్పటికీ ఆడుతూ ఉంటే.. కచ్చితంగా నేను కూడా ఆడతాను’ అని డివిలియర్స్ అన్నాడు.

గతేడాది... డివిలియర్స్..అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ వంటి విదేశీ లీగ్‌ల్లో మాత్రమే ఏబీ ఆడుతున్నాడు. అయితే గతేడాది తన ఆకస్మిక నిర్ణయంపై గౌరవ్‌ కపూర్‌ నిర్వహించిన బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌ షోలో ఈ విషయంపై  పెదవి విప్పాడు. అది అప్పుడు ఉన్న పరిస్థితుల్ని తన రిటైర్మెంట్‌ను ప్రకటించాల్సి వచ్చిందని, అది చాలా సున్నితమైన అంశంగా పేర్కొన్నాడు. 

2019లో వరల్డ్‌కప్‌లో ఆడాలని అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించని కారణంగా వీడ్కోలు చెప్పాల్సి వచ్చిందన్నాడు. ఈ క్రమంలోనే 2023 వరల్డ్‌కప్‌లో ఆడతారా? అని అడగ్గా, అప్పటికీ ఎంఎస్‌ ధోని ఆడితే తాను వరల్డ్‌కప్‌ ఆడే విషయంపై పునరాలోచిస్తానన్నాడు