వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్.. మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. సిక్స్ ల మోత మోగించి.. సరొకత్త రికార్డును కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు(488) సాధించిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది పేరిట ఉన్న అత్యధిక(476) సిక్సర్ల రికార్డును గేల్ బ్రేక్ చేశాడు.

ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో గేల్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ (398), శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య(352), టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(349), సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని(348) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.