ఆస్ట్రేలియా జట్టుపై చారిత్రాత్మక విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన టీంఇండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియా జట్టుపై అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ టీంఇండియా ఆటగాళ్లు పైచేయి సాధించారు. ఇలా మెరుగైన ఆటతీరుతో భారత జట్టుకు భారీ  సీరిస్ విజయం అందించిన ఆటగాళ్లు వ్యక్తిగతంగా కూడా టెస్ట్ ర్యాంకింగ్స్ లో మంచి ర్యాంకు సాధించారు. 

ఇవాళ ఐసిసి ప్రకటించిన టెస్ట్ ర్యాకింగ్స్  మళ్లీ కోహ్లీనే ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇక అతడి తర్వాతి స్థానాన్ని మ్యాన్ ఆప్ ది సీరిస్ చతేశ్వర్ పుజారా నిలిచాడు. ఈ సీరిస్ లో మొత్తం 74 పరుగుల సగటుతో పుజారా 521 పరుగులు సాధించాడు. దీంతో 881 పాయింట్లు సాధించి తన ర్యాకింగ్ మెరుగుపర్చుకున్న పుజారా మొత్తంగా మూడో స్థానంలో నిలిచాడు. అతడికంటే ముందు 897 పాయింట్లతో రెండో స్థానంలో కేన్ విలియమ్ సన్ నిలిచాడు. 

ఇక ఈ సీరిస్ లో శతకంతో రాణించిన యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ 673 రేటింగ్‌ పాయింట్లతో 17 స్థానంలో నిలిచాడు. ఫలితంగా భారత్‌ తరఫున బెస్ట్‌ ర్యాంక్‌ సాధించిన వికెట్‌ కీపర్ ఫరూఖ్‌ ఇంజనీర్‌ రికార్డును సమం చేశాడు. 1973 లో ఫరూఖ్‌ ఇంజనీర్‌ 17 ర్యాంకును సాధించగా, మళ్లీ ఓ వికెట్ కీఫర్ 17 వ ర్యాంకు సాధించడం ఇదే మొదటిసారి. స్పెషలిస్ట్ వికకెట్ కీపర్ ధోనిది కూడా టెస్టుల్లో కేవలం 19 వ ర్యాంకే అత్యుత్తమం.

సంబంధిత వార్తలు

సొంత బౌలర్‌పై ఆసీస్ విమర్శలు.. వెనకేసుకొచ్చిన కోహ్లీ

టీంఇండియాపై ప్రశంసల వర్షం...పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో సహా

ఆటలోనే కాదు... టీంఇండియా సంబరాల్లోనూ దేశభక్తి....(వీడియో)

చారిత్రక విజయానందాన్ని భార్య అనుష్కతో పంచుకున్న కోహ్లీ...విక్టరీ వాక్ (వీడియో)

ఆసీస్ గడ్డపై భారత్ చారిత్రక విజయం.. బ్యాట్స్‌మెన్ల పాత్ర ఎంత..?

నటి ఈషా గుప్తాతో డేటింగ్ పై హార్దిక్ పాండ్యా స్పందన ఇదీ...

దుమారం: నోరు జారిన రవిశాస్త్రి

సగం.. సగం పనులు చేయకండమ్మా...ప్రీతిజింటాపై నెటిజన్ల ఫైర్