ఆస్ట్రేలియా పర్యటనలో టీంఇండియా బ్యాట్ మెన్ చతేశ్వర్ పుజారా జోరు కొనసాగుతోంది. తన స్పెషలిస్టు టెస్ట్ బ్యాటింగ్ తో కంగారు బౌలర్లను పుజారా కంగారెత్తిస్తున్నాడు. ఓ వైపు ఓపిక, సంయమనంతో బౌలర్లను ఎదుర్కొంటూ... చెత్త బంతులు వస్తే మాత్రం శిక్షిస్తూ పుజారా తనదైన ఆటతీరు కనబరుస్తున్నాడు. మరోవైపు చాపకింద నీరులా అరుదైన రికార్డులను బద్దలుగొడుతున్నాడు. తాజాగా మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టులో కూడా మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు.    

మొదటి టెస్టులో అద్భుతమైన సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్స్ లో విలువైన భాగస్వామ్యం నెలకొల్పి పుజారా జట్టును ఆదుకుని విజయ తీరాలను చేర్చాడు. మొదటి ఇన్నింగ్స్ లో 123 పరుగులు సాధించడానికి పుజారా 246 బంతుల్ని ఎదుర్కోగా...రెండో ఇన్నింగ్స్ లో 71 పరుగులు చేయడానికి కూడా 204 బంతులు ఎదుర్కొన్నాడు. రెండో టెస్టులో పుజారా రాణించలేకపోయాడు. 

ఇక మెల్ బోర్న్ లో ఇవాళ మొదలైన మూడో టెస్టులో పుజారా మరోసారి రెచ్చిపోయాడు. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి పుజారా 68 పరుగులు 200 బంతుల్లో సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఇలా ఓ టెస్ట్ సీరిస్ లో వరుసగా మూడోసారి 200 బంతుల్ని ఎదుర్కొని పుజారా అరుదైన రికార్డు సృష్టించాడు. 

గతంలో భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేరిట వున్న రికార్డును పుజారా సమం చేశాడు. గవాస్కర్ కూడా ఇలాగే సంయమనంతో ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్ల ఓపికను పరీక్షించేవాడు. మంచి బంతుల్ని గౌరవిస్తూనే చెత్త బంతులకు పరుగులు రాబట్టేవాడు. ఇలా 1977-78 మధ్య కాలంలో జరిగిన ఓ టెస్ట్ సీరిస్ లో గవాస్కర్ ఇలాగే 200 పైచిలుకు బంతుల్ని ఎక్కువసార్లు ఎదుర్కొని రికార్్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు పదిలంగా వున్నఆ రికార్డును పుజారా తాజా టెస్టులో సమం చేశాడు.  

మరిన్ని వార్తలు

మెల్ బోర్న్ టెస్టులో మయాంక్‌కు అవమానం... అతిచేసిన ఆసిస్ కామెంటెటర్లు

పాక్ ప్రధానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కైఫ్

మళ్లీ టీ20 జట్టులోకి ధోనీ...పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

ఆ విషయం కోహ్లీకి బాగా తెలుసు.. అనిల్ కుంబ్లే

నా ఆటోబయోగ్రఫీకి మూలం ‘‘ఆ రోజు ఆ పెద్దాయన మాటలే’’: లక్ష్మణ్

ఆస్ట్రేలియా జట్టులో ప్లేస్ కొట్టేసిన ఏడేళ్ల బాలుడు

కోహ్లీపై ఆస్ట్రేలియా జర్నలిస్ట్ అభ్యంతర పోస్ట్.. నెటిజన్ల ఫైర్

పెళ్లి పీటలెక్కిన మరో టీమిండియా క్రికెటర్

కెప్టెన్‌ దూకుడుగా ఉంటేనేగా టీమ్‌కు ఊపొచ్చేది: వివ్ రిచర్డ్స్

షాకింగ్ న్యూస్: ధోనికి ఇల్లు లేదట