మరో టీమిండియా క్రికెటర్ పెళ్లి పీటలెక్కాడు.. యువ క్రికెటర్ సంజు శాంసన్ తన చిన్ననాటి స్నేహితురాలు చారులతని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. కేరళకు చెందిన సంజు శాంసన్‌‌, చారులతల కుటుంబాలకు మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో సంజూ-చారులతల మధ్య ప్రేమ చిగురించింది.

ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల్లోని పెద్దలను ఒప్పించి కోవలంలోని రిసార్టులో కుటుంబసభ్యుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే సంజూ క్రిస్టియన్ మతస్తుడు కాగా, చారులత హిందూ మతానికి చెందిన యువతి.

వీరిద్దరి వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం కింద నమోదు చేశారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన సంజూను 2013 ఐపీఎల్ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ టీమ్ కొనుగోలు చేసింది. ఈ టోర్నీలో అద్బుత ప్రదర్శన కనబరచడంతో సెలక్టర్ల చూపు సంజూపై పడింది. దీంతో 2015 జూలైలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌కు అతనిని ఎంపిక చేశారు.