పాకిస్థాన్ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి  ఇండియన్ మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మైనార్టీల విషయంలో భారత ప్రభుత్వంపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇమ్రాన్ ఖాన్ కామెంట్స్ కి కైఫ్ ట్విట్టర్ వేదికగా సమాధానమిచ్చాడు.

భారత ప్రభుత్వం మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఇమ్రాన్ ఖాన్ కామెంట్స్ చేయగా.. పాకిస్థాన్ తో పోలిస్తే.. ఇండియాలో మైనార్టీలు క్షేమంగా ఉన్నారని కైఫ్ అన్నారు.  పాకిస్థాన్ లో 1947లో 20శాతం ఉన్న మైనార్టీలు ప్రస్తుతం 2శాతానికి పడిపోయారని కైఫ్ గుర్తు చేశారు. అదే సమయంలో భారత్ లో మాత్రం మైనార్టీల సంఖ్య బాగా పెరిగిందని కైఫ్ అన్నారు.  మైనార్టీలను ఎలా ట్రీట్ చేయాలో ఇతరదేశాలకు చెప్పాలంటే.. పాకిస్థాన్ అన్ని దేశాల కంటే ఆఖరిలో ఉంటుందని కైఫ్ అన్నారు.