టీంఇండియా వైస్ కెప్టెన్, స్టార్ బ్యాట్‌మెన్ రోహిత్ శర్మ క్రికెట్ ను ఎంత ప్రేమిస్తారో అందరికి  తెలిసిందే. అయితే ఖాళీ దొరికినప్పుడల్లా కుటుంబంతో ఎక్కువగా గడుపుతుంటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా వున్న రోహిత్ ఇవాళ తన భార్య రితిక పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లలో ఉద్వేగపూరితంగా శుభాకాంక్షలు తెలిపాడు. 

ఇన్‌స్టాగ్రామ్ లో గత సంవత్సరం రితిక పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫోటోను పోస్ట్ చేసి దానికి ఓ కామెంట్ ని జతచేశాడు. ''నాలో సగమైన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి సమయంలో నీ పక్కన లేనందున క్షమాపణలు కోరుతున్నా. ఈ సందర్భంగా గత సంవత్సరం నీ పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫోటోనే నీతో పంచుకుంటున్నా'' అంటూ రోహిత్ కామెంట్ చేశాడు. 

ఇక ట్విట్టర్ ద్వారా కూడా రితికకు రోహిత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. '' నాలో మరోసగమైన నీకు(రితికకు) జన్మధిన శుభాకాంక్షలు.  పుట్టినరోజు సందర్భంగా నీ పక్కనలేకపోవడాన్ని చాలా మిస్ అవుతున్నా. అయినా నువ్వు సంతోషంగా వేడుక జరుపుకుంటావని భావిస్తున్నా. నేను లేకుండా జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలను తానెప్పుడూ గుర్తుపెట్టుకుంటా'' అంటూ ట్వీట్ చేశాడు.