సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ నుంచి బిసిసిఐ సెలెక్టర్లు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తప్పించారు. ఆయనకు ఆస్ట్రేలియా వన్డే సిరీస్ నుంచే కాకుండా న్యూజిలాండ్ పర్యటనను నుంచి కూడా విశ్రాంతి కల్పించారు. 

బుమ్రా స్థానంలో మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచుల సరీస్ లో బుమ్రా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ సరసన నిలిచాడు. 

స్వదేశీ గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ ను దృష్టిలో ఉంచుకుని బుమ్రాపై వర్క్ లోడ్ ను తగ్గించాలని నిర్ణయించి తగిన విశ్రాంతి కల్పించాలని నిర్ణయించినట్లు బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

న్యూజిలాండ్ తో జరిగే మూడు మ్యాచుల ట్వంటీ20 సిరీస్ భారత జట్టులో పంజాబ్ పేసర్ సిద్ధార్థ్ కౌల్ కు చోటు దక్కింది. బుమ్రాపై పెరుగుతున్న వర్క్ లోడ్ ను తగ్గించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. 

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ శనివారంనాడు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడడానికి న్యూజిలాండ్ వెళ్తుంది. న్యూజిలాండ్ పర్యటన జనవరి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

సంబంధిత వార్తలు

పంత్ ప్లాన్ చేశాడు...పుజారా తడబడ్డాడు:గెలుపు సంబరాలపై కోహ్లీ (వీడియో)

ఆసీస్ గడ్డపై భారత్ చారిత్రక విజయం.. బ్యాట్స్‌మెన్ల పాత్ర ఎంత..?

నా జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ ఇదే.. కోహ్లీ

72 ఏళ్ల నిరీక్షణ తర్వాత...భారత్‌‌కు దక్కిన ఆ విజయం

సిడ్నీ టెస్ట్: మ్యాచ్ డ్రా, ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్

సిడ్నీ టెస్ట్: ముగిసిన నాలుగోరోజు ఆట.. 322 పరుగుల వెనుకబడ్డ ఆసీస్

మరీ ఇంతటి పతనమా...30 ఏళ్ల తర్వాత ఫాలో ఆన్ ఆడుతున్న ఆసీస్

సిడ్నీ టెస్టు: రెండో ఇన్నింగ్సు ప్రారంభించిన ఆస్ట్రేలియా

‘‘పంత్.. ధోనీని దాటేస్తాడు’’

కేఎల్ రాహుల్ నిజాయితి... అంపైర్ ప్రశంసలు

సిడ్నీ టెస్టులో కోహ్లీకి అవమానం...

ఆసిస్ సెలెక్టర్లకు బుర్ర లేదు: విరుచుకుపడ్డ షేన్‌వార్న్

ధోని పాకిస్థాన్ రికార్డును బద్దలుగొట్టిన పంత్.... 12ఏళ్ల తర్వాత