Asianet News TeluguAsianet News Telugu

భూ కైలాసం మానస సరోవరం

ఫిట్నెస్ ఉంటే కైలాసానికి వెళ్లి పరమ శివుని చూసి చక్కగా తిరిగి రావచ్చు. కైలాసానికి శరీరంతో ఎలా వెళ్లగలమని ఆలోచించకండి. కైలాసం మన భూమిపైనే ఉంది.

the story of Bhukailash Shiv Temple
Author
Hyderabad, First Published Jun 15, 2020, 11:49 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

శరీరంతో కైలాసానికి వెళ్లటం గురించి విన్నాం. కానీ, ఇప్పుడు ఇది వాస్తవం. కైలాసానికి మనం బొందితోనే వెళ్లవచ్చు. తిరిగి రానూ వచ్చు. కాకపోతే కొద్దిగా ఫిట్నెస్ అవసరం. ఫిట్నెస్ ఉంటే కైలాసానికి వెళ్లి పరమ శివుని చూసి చక్కగా తిరిగి రావచ్చు. కైలాసానికి శరీరంతో ఎలా వెళ్లగలమని ఆలోచించకండి. కైలాసం మన భూమిపైనే ఉంది.

హిమాలయ పర్వతాలలో ఉంది. సముద్ర మట్టానికి 22778 అడుగుల ఎత్తులో ఉంది. టిబెట్ భూభాగంపై ఉన్నది. ఈ కైలాసంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు. వేలాది భక్తులకు దర్శనమిస్తున్నారు ఆ ముద్ర మట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో సైన్సుకు అందని అసాధా సరణ వ్యవస్థ కైలాసం అది పరమ శివుడి ఆవాసం. ఆదిశక్తి పార్వతి నివా సం. శివుడ్ని సాక్షాత్కరింప చేసుకునేందుకు లంకేశ్వరుడైన రావణుడు తన పది తలలతో ఎత్తిన కైలాస పర్వతం ఈ భూమిపైనే ఉంది. నిజమే హిమా చలంలో మన కళ్ల ముందు కనిపిస్తోంది . 

సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తు లో 52 కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచుకొండల నడుమ నెలవైన ఈ కైలాస పర్వతంపైనే పరమ శివుడున్నాడని ప్రతీతి. అంటే భూమిపైనే ఆ ఆది దేవుడు కొలువై ఉన్నాడు. ఈ కొండపైనే తన రుదత్రాండవం చేస్తున్నాడు. లయకా రుడి లయ విన్యాసం, త్రినేత్రుడి సాక్షాత్కారం కైలాసంపై ఈశ్వరుడి ఉనికి కాదనలేని నిజం, దైవత్వానికి మహాదేవుని నిర్వచనం. కైలాస పర్వతంపై భాగంలో ఏముంది? ఎవరికీ తెలియని అంతులేని రహస్యం ఏమిటి? భూమిపైనే ఈశ్వరుడి ఉనికి నిజమేనా? అని యక్ష ప్రశ్నలెన్నో ఉదయిస్తాయి. 

నిజమే, పరమేశ్వరుడు ఈ భూమిపైనే ఉన్నాడు. మనముంటున్న ఈ నేలపైనే నివాసమున్నాడు. అవును ఇది అక్షరాలా నిజం. ఇక్కడే. ఈ గాలిలో, ఈ నేలలో ఈ మట్టిపైనే ఆయన ఉన్నాడు. భక్తులకు సాక్షాత్కరిస్తున్నాడు. వారి మనోరథాల్ని నెరవేరుస్తున్నాడు. శివుడి కైలాసం భూమిని దాటి మరెక్కడో లేదు. ఆయన కైలాసం ఇక్కడే ఉంది. మన దేశానికి కూతవేటు దూరంలో ఉంది. సిద్ధ పురుషులకు ఆవాసమైన మంచుకొండల నడుమ ఉంది. ఈ కైలాసంపైనే శివుడు ఉన్నాడు. ఆయన ఉనికి అక్కడ స్పష్టంగా ఉంది. సైన్సు అంతుపట్టని అపురూప శక్తి ఏదో అక్కడ దాగి ఉంది.

మౌంట్ కైలాస్ ప్రపంచంలో స్పిర్చ్యువాలిటీ సంపూర్ణంగా వ్యాపించిన ఏకైక ప్రాం తం. ఇక్కడికి వెళ్లి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. ఏదో ఒక రూపంలో ఉమా శంకరుల దర్శనం జరుగుతోంది. ఉమాశంకరులే కాదు. శివపార్వతుల ఫ్యామిలీ అంతా ఇక్కడ కొలువై ఉన్నది.

కైలాస పర్వతం చుట్టూ ట్రెకింగ్ చేస్తున్న కొద్దీ ఒక్కో రూపం మనకు దర్శనమిస్తుంది. నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఒక్కో చోట ఒక్కో రూపంలో భక్తులకు కనిపిస్తారు. మౌంట్ కైలాస్ ఎవరికీ తెలియని ఓ రహస్యమే. ఇది మామూలు పర్వతం కాదు.. హిమాలయ శ్రేణుల్లో ఏ పర్వతానికీ లేని ప్రత్యేకతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. అర్థం కాని రహస్యాలు అనేకం ఇక్కడ దాగున్నాయి. ఇది నాలుగు వైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది.

నాలుగు రత్నాల్లో, నాలుగు రంగుల్లో దర్శనమిస్తుంది. ప్రపంచంలోని వండర్స్ అన్నింటికీ వండర్ మౌంట్ కైలాస్. దేవుణ్ణి దర్శించాలంటే కఠిన మైన నియమాలు పాటించాలి. తపస్సు చేయాలి. ఉపాసన చేయాలి. యజ్ఞ యాగాదులు చేయాలి. ఇంకా ఏవేవో చెప్తారు మన పెద్దలు. దేవుణ్ణి చూడటం అంటే అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు. ఎంత కష్టపడితే తప్ప. సాధ్యం కాదని చెప్పటమే వీటన్నింటి ఉద్దేశం. కైలాస్ మానస సరోవర్ యాత్ర అచ్చంగా అలాంటిదే. అన్ని కష్టాలకూ పరాకాష్ట. ఊపిరి కూడా తీసుకోవటం కష్టమైన యాత్ర. సముద్ర మట్టానికి ఎన్నో వేల అడుగుల ఎత్తు. ఆక్సిజన్ అంతంత మాత్రం. అసలు వేడి అంటే ఏమిటో మచ్చు కైనా తెలియని వాతావరణం. శరీరం రాయిలా బిగుసుకుపోయేంత చలి. ఇతర తీర్థయాత్రా స్థలాల్లో కనిపించే కనీస సౌకర్యాలు ఉండవు. ఇలాంటి చోట 52 కిలోమీటర్లు ట్రెకింగ్ చేయాలి. ఈ యాత్ర ఒక జీవిత కాలం తపస్సు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. 

ఖాట్మండు మీదుగా ప్రారంభమయ్యే యాత్ర తారాపీర్, గౌరీకుండం మీదుగా కైలాస్ చేరుకుంటారు. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగానే ఫిట్నెస్ చెక్ చేయించుకోవలసి ఉంటుంది. అన్ని విధాలా ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే కైలాస్ యాత్రకు అనుమతిస్తారు. కైలాస్ పర్వతానికి చేరుకోవటం అంటే మృత్యువును ఎదిరించి ముందుకు పోయినంత సాహసమే. పర్వతాన్ని ఒకసారి చుట్టి రావటానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుంది. ఆక్సీజన్ అతి తక్కువగా ఉన్న ప్రదేశంలో నాలుగు రోజుల పాటు నడవటం ఎంత కష్టమో వేరే చెప్పేదేముంది? శరీర కష్టం కంటే మానసిక ధైర్యంపైనే ఆధ్యాత్మిక బలంపైనే కైలాస్ పర్యటన కొనసాగుతుంది. 

కైలాసం శివుడి పూర్ణస్వరూపమని విశ్వాసం. అక్కడకు వెళ్లిన అనేక మంది భక్తులకు పర్వతం ఆసాంతం శివరూపంగా దర్శనమిచ్చిన తార్కాణాలు ఉన్నాయి. విచిత్రమేమంటే కైలాస పర్వతం దగ్గరకు వెళ్లిన యాత్రికులు పర్వతాన్ని మాత్రం అధిరోహించే ప్రయత్నం చేయరు. పర్వత పాదాన్ని తాకే ప్రయత్నమైనా చేయరు. వెళ్లేందుకు ఎవరు సాహసించినా అంతే సంగతులని చెప్తారు. ఇది ఎంత వరకు నిజం. ఎవరెస్టును సైతం అధిరోహించిన మనిషి కైలాస పర్వతం పైకి మాత్రం ఎందుకు వెళ్లలేకపోతు న్నాడు. కైలాస పర్వతం పైకి 
అధిరోహించటం అంత తేలికైన సంగతేం కాదు. పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేయటం తప్ప దాన్ని తాకేందుకు కూడా ప్రజలు భయపడతారు. 

ఎవరెస్టు ఎక్కటానికి లేని భయం కైలాసం తాకటానికి ఎందుకు? కైలాసం ఉపరితలంపై ఏముంది. కనీసం హెలికాప్టర్లు కూడా దీనిపై భాగం నుంచి వెళ్లేందుకు సాహసించలేని పరిస్థితి వెనుక మర్మమేమిటి? ఈ భూమిపై హిమాలయాలు ఏర్పడి సుమారు పది మిలియన్ల సంవత్సరాలు అయినట్లు సైంటిస్టులు చెప్తారు. 

కైలాస్ పర్వతం వయసు కూడా బహుశా అంతే అయి ఉండవచ్చు. అయితే మిగతా హిమాలయ పర్వతాలకు, కైలాసానికి స్పష్టమైన తేడా ఉంటుంది. కైలాస్ పర్వతం ఒకప్పటి అఖండ భారతానికి సెంటర్ పాయింట్లో ఉంది. గురుత్వాకర్షణ శక్తికి గరిమనాభి ఎలాంటిదో. అఖండ భారతానికి సెంటర్ పాయింట్ కైలానం. ఆరు హిమాలయ పర్వత శ్రేణులకు మధ్యలో కైలాస పర్వతం ఉంది. ఒక విధంగా చూస్తే కమలం ఆకారంలో కనిపిస్తుంది. కైలాస్ పర్వతం నాలుగు వైపుల నాలుగు రంగుల్లో కనిపిస్తుంది.

ఒక వైపు నుంచి చూస్తే పూర్తిగా స్పటికంలా కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే బంగారు వర్ణం గోచరిస్తుంది.. మూడో వైపు రూబీలాగా నాలుగో వైవు నీలం రాయిగా గోచరిస్తుంది. అంతే కాదు.. కైలాసానికి నాలుగు రూపాలూ ఉన్నాయి. ఒకవైపు గుర్రంగా
ఇంకోవైపు సింహంగా, మూడో వైపు ఏనుగుగా, నాలుగో వైపు నెమలిగా కనిపిస్తాయి. ఇందులో గుర్రం హయగ్రీవ రూపం కాగాను, సింహం పార్వతీదేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుడికి ప్రతీక అయితే, నెమలి కుమారస్వామికి 
వాహనం.. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెప్తాయి. 

కైలాస్ పర్వతంలో అత్యంత కీలకమైన విషయం దక్షిణ ఆసియాను సస్యశ్యామలం చేస్తున్న నాలుగు పవిత్ర నదులు ఈ ప్రాంతం నుంచే ఉద్భవించటం. గంగ, సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదులు ఇక్కడి నుంచే కిందకు ప్రవహిస్తాయి. మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు వెండికొండలా మిలమిల మెరిసే కైలాన దర్శనం అద్భుతం. ఈ పర్వత పాద పీఠంలో బ్రహ్మ మానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి ఉండదని చెప్పే సైన్స్ మాటను నిజం చేసే సరస్సు ఇది. నీటికి ఇంత స్వచ్చత ఈ భూమిపై కన్ను పొడుచుకుని చూసినా కనిపించదు. 

పరమేశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే. కైలాసం పైకి అధిరోహించటం ఇప్పటికి ఎవరి వల్లా సాధ్యం కాలేదు. పదవ శతాబ్దంలో బౌద్ధ మత గురువు మిలా రేపా కైలాస పర్వతాన్ని ఎక్కినట్లు చెప్తారు. అంతకు ముందుకానీ ఆ తరువాత కానీ ఎవరూ దీన్ని సృశించేందుకు కూడా సాహసించలేదు.

సాహసించిన వారు కనిపించకుండా దృశ్యమై పోయారని చెప్తారు. 1954 లో కైలాన్ యాత్రను నిషేధించిన చైనా కూడా దీనిపై ప్రయోగం చేసి విఫలమైంది. రెండు సార్లు హెలికాప్టర్లు పంపిస్తే అవి తిరిగి రాలేదు. ఆ తరువాత ఎవరూ సాహసించలేదు...... ఎన్నో ప్రయోగాలు జరిగాయి.. ఏమీ తేలలేదు. ఇప్పటి వరకు కైలాస్ పర్వతం అవుటర్ సర్కిల్లో తిరిగిన వాళ్లే తప్ప ఇన్నర్ సర్కిల్లోకి ప్రవేశించిన వాళ్లూ లేరు.. 21సార్లు అవుటర్ సర్కిల్లో తిరిగిన తరువాత ఇన్నర్ సర్కిల్లోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. అది అంత తేలిక కాదు.. అఘోరాల్లాంటి వాళ్లకు కానీ సాధ్యం కాదు.

ఈ క్లిష్టమైన పర్వతం ఉపరి భాగంపై ఏమున్నదన్నది సైన్సకు మాత్రం అందలేదు. భక్తులకు మాత్రం కైలాసంపై శివుడు సాకారంగా సాక్షాత్కరిస్తున్నాడు. ధ్యాన ముద్రలో కనిపిస్తున్నాడు. లింగరూపుడై దర్శనమిస్తున్నాడు. కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాడు. ఇది విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు అతీతమైంది, అంతు చిక్కనిది. కైలాస్ దర్శనం భక్తులకు ఒక అపూర్వ అనుభూతి. హిమాలయ సానువుల్లో సువర్ణభాండం. పరమేశ్వరుడి దివ్యధామం. పార్వతి దేవి కొలువైన పవిత్ర క్షేత్రం. అణువణువులోనూ శివస్వరూపాన్ని నింపుకున్న ప్రాంతం. మాటల్లో వర్తించలేని భావమది. పదాలకు అందని పవిత్రత అది. అందుకే భక్తులు మానస సరోవరాన్ని భూలోక కైలాసంగా 
పిలుచుకుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios