శృంగార జీవితంలో ఈ మార్పులు... మంచివే!

దంపతులు తమ వైవాహిక జీవితంలో ముఖ్యంగా శృంగారం విషయంలో కొన్ని మార్పులు చేసుకుంటే మాత్రం... కచ్చితంగా మళ్లీ సెక్స్ లైఫ్ ఆనందంగా మారతుందట.

Changes all married couples should make in their sex life

పెళ్లైన కొత్తలో ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. నిత్యం తమ పార్ట్ నర్ వెంటే ఉండాలని, వారతోనే సమయం గడపాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కానీ.... పెళ్లై కొంతకాలం తర్వాత... ఆ ఆసక్తి తగ్గిపోతుంది. సెక్స్ అంటే బోర్ వచ్చేస్తుంది. లైఫ్ లో మసాలా మిస్ అయిన ఫీలింగ్ ఎక్కువగా కలుగుతుంది. దంపతుల మధ్య సాన్నిహిత్యం, కలయికలో పాల్గొనాలనే కోరిక.. ఇలా అన్నింటి పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. అయితే... దంపతులు తమ వైవాహిక జీవితంలో ముఖ్యంగా శృంగారం విషయంలో కొన్ని మార్పులు చేసుకుంటే మాత్రం... కచ్చితంగా మళ్లీ సెక్స్ లైఫ్ ఆనందంగా మారతుందట. అవేంటో ఓసారి చూద్దాం....

సెక్స్ కోసం సమయాన్ని నిర్ణయించండి

మీకు , మీ భాగస్వామికి సెక్స్ కోసం సమయం లేనట్లు అనిపిస్తే, మీరు సెక్స్ కోసం సమయాన్ని షెడ్యూల్ చేయాలి! ఇది చాలా అన్‌రొమాంటిక్‌గా అనిపించవచ్చు, కానీ ఇది మిమ్మల్ని , మీ భాగస్వామి  లైంగిక జీవితాన్ని తిరిగి దారిలోకి తీసుకురాగలదు. మీరు సెక్స్ కోసం సమయాన్ని షెడ్యూల్ చేసినప్పుడు, మీ మనస్సు దీనిపై దృష్టి పెట్టడం వల్ల  ఇతర విషయాలు మీకు భంగం కలిగించవు.

సెక్స్ కోసం వెంటపడొద్దు...

సెక్స్‌ కోసం భాగస్వామి వెంట పడటం కూడా మంచిది కాదు.  మీ భాగస్వామికి సెక్స్ పట్ల ఆసక్తి లేకుంటే, మీరు సెక్స్ కోసం మీ భాగస్వామిని వెంబడించడం మానుకోండి. మీరు పదేపదే సెక్స్ కోసం అడిగే బదులు వారు వారి స్వంతంగా సెక్స్ కోరుకునేలా చేయాలి. మీరు తరచూ సెక్స్ కోసం ఇబ్బంది పెట్టడం వల్ల.. మీ భాగస్వామి కొన్ని సమయాల్లో నిరుత్సాహానికి గురవుతారు. కాబట్టి... వారికి మీ మీద కోరిక పెరిగేలా చేయాలి.

 లైంగిక ప్రవేశంపై దృష్టి పెట్టడం మానేయండి

మీకు, మీ భాగస్వామికి మధ్య లైంగిక ప్రవేశం అంతిమ లక్ష్యం కాకూడదు. ఫోర్ ప్లే, ఓరల్ సెక్స్, సాధారణ ముద్దులు, తాకడంపై దృష్టి పెట్టండి. మీ సెక్స్ రొటీన్‌లో ఫోర్‌ప్లేని చేర్చడం అనేది లైంగిక ప్రవేశాన్ని చాలా సులభతరం చేయడానికి ఒక గొప్ప మార్గం. వీటిపై దృష్టి పెడితే... సెక్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది.

డేట్ కోసం వెళ్ళండి

జంటలు తమ వైవాహిక జీవితంలో స్పార్క్‌ను సజీవంగా ఉంచుకోవడానికి డేట్ కి వెళ్లడం లాంటివి చేయాలి. ఇది ఇద్దరి మధ్య రొమాన్స్ ని సజీవంగా చేస్తుంది. దంపతుల మధ్య ఉద్రేకం పెరగడానికి కూడా సహాయపడుతుంది. మళ్లీ కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టిన భానవ కలుగుతుంది.


ప్రేమ మరింత పెంచుకోవాలి....

దాంపత్యంలో కోల్పోయిన సాన్నిహిత్యాన్ని తిరిగి తీసుకురావడానికి దంపతులు ముందుగా ఒకరిపై మరొకరు ప్రేమ పెంచుకునే ప్రయత్నం చేయాలి. కేవలం సెక్స్ సమయంలో నే కాదు.... మామూలు సమయాల్లో కూడా ఒకరినొకరు తాకడం, ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం లాంటివి చేయాలి. ఇవి ఇద్దరి మధ్య  అనుబంధాన్ని పెంచడానికి సహాయపడతాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios