నల నల్లని వైకుంఠ ధామం
ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. చిత్రమేమిటంటే, తెలంగాణ మహిళ బొమ్మతో విశ్వ విఖ్యాతమైన వైకుంఠం గారి వెనుక ఒక పురుషుడు ఉన్నాడు. ఆదిలో అతడు నల్లనివాడు. సామాన్యుడు. లేబర్. అతడు విస్తారం. ఆ ప్రస్థానానికి నాంది ఆరంభమైనట్లే ఉన్నది.
ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. చిత్రమేమిటంటే, తెలంగాణ మహిళ బొమ్మతో విశ్వ విఖ్యాతమైన వైకుంఠం గారి వెనుక ఒక పురుషుడు ఉన్నాడు. ఆదిలో అతడు నల్లనివాడు. సామాన్యుడు. లేబర్. అతడు విస్తారం. ఆ ప్రస్థానానికి నాంది ఆరంభమైనట్లే ఉన్నది.
-కందుకూరి రమేష్ బాబు
ఐడెంటిటీ మెమరీ...
అంతేకాదు,అత్యంత ఆకర్షణీయమైన రంగులతో, ముఖ్యంగా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ – ఈ మూడు ప్రైమరీ కలర్స్ తో ప్రపంచాన్ని జయించిన తోట వైకుంఠంగారియాత్ర అత్యంత సాదాగా -నిజానికి పెన్సిల్, చార్ కోల్ తో మొదలయిందీ అంటే నమ్మలేం. కానీ అదే సత్యం.
జనసామాన్యం
ఆనలుపేనిదానంగా అనేక మార్పులకు లోనవుతూ 1985 కల్లాఎంతగాఎదిగి నిగ్గు తేలిందీ అంటే ఇక అంతా వర్ణమే.అవును మరి.అద్భుతమైన, కాశవంతమైన,చూపులు తిప్పుకోలేనంత ఘాడమైన వర్ణ సంచయంగావైకుంఠంగారికాన్వసూ జీవితమూ మారినదీ అంటే ఆ నలుపే కారణం.అదితిరుగులేని చరిత్ర. నలుపుఅనంతరమే వర్ణం. ఆవర్ణమూ మహిళతోడుడే. చిత్రమేమిటంటే,ఆ మహిళ ఉత్తానం వెనుక ఉన్నది జన సామాన్యం. గ్రామీణ జానపదం. అదే ఈ మహనీయమైన చిత్రకారుడి Identity and memory అంటే అతిశయోక్తి కాదు.
నిజానికినాటి బొమ్మల్లోనేపాత కరీంనగర్ జిల్లాకు చెందిన బూరుగుపల్లి వైకుంఠం బహుముఖంగాదర్శనమిస్తారు. తన ఊరే తెలంగాణగా ఉన్న అప్పటిచిత్రకారుడి చిత్తమూ చిత్రమూ విస్త్రుతమూ, వైవిధ్య భరితమూ. అదిప్పుడుప్రదర్శనకు ఉన్నది.
వైకుంఠం సృజనకు అవేచిత్తు ప్రతులు
హైదరాబాద్ లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో మరిమూడు రోజుల పాటు (ఫిబ్రవరి 24 వరకు) ప్రదర్శనలో ఉన్న తోట వైకుంఠంగారిడ్రాయింగ్స్, చార్కోల్స్, ఇత్తడి శిల్పాలు ఆ పరిణామ క్రమానికి దాఖలాలు.అవన్నీదాదాపు ఇదు దశాబ్దాల వారి సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసే చిత్త ప్రతులు. చిత్రకకళా జగత్తులో వారి ఎదురీతనుపట్టిచ్చేఅసలైనవైకుంఠం ద్వారాలు. వారి పరిపూర్ణత యాత్రకుసిసలైన భావనా తరంగాలు.వాటిని దర్శించడం నిజంగాగొప్ప అనుభవం.
నిదానంగానే...
తోట వైకుంఠం గారి వర్ణ చిత్రాలు అందరూ చూసినవే. ముఖ్యంగాతెలంగాణ మహిళల చిత్రాలు జగమేరిగినవే. ఐతే, కాల ప్రవాహంలో వారు అత్యంతఆకర్శణీయాలైన ఆ చిత్రాల చెంతకు వచ్చి అగడానికి ముందు జరిగిన ప్రయాణం సుదీర్ఘం. నెమ్మదితో కూడినది.అది అత్యంత సంఘర్శనాత్మకంకూడానూ.అదంతానూ‘నలుపు’అనే చెప్పాలి.
నలుపంటే వేదన
ఎనభయ్యవ దశకం ప్రారంభందాకా వైకుంఠంగారువిఫల చిత్రకారులే. ఎనభై దశకం చివరి నుంచే అయన కాన్వాసు మెరిసిపోయింది.ఆ రంగులమయమైన చిత్రాలకు ఈవల, అంతకుముందు ఉన్నదంతా అత్యంత వేదనాత్మక పరిశ్రమ.అది కేవలం లేతపెన్సిల్, ముదురుబొగ్గురేఖలలాస్యమే.అది విలసంగా మారిన పిదప పరిస్థితి వేరుగానీ, అంతకుముందు ఉన్న అతడి చిత్రమూ చిత్రమూ అసలైన జ్వాల అనడంలో సందేహం లేదు. అదేఒక భావనా తరంగమై రంగుల్లో వ్యక్తమైశోభించిందీ అనాలి.
ఈ చిత్రాలన్నీ తన శైలినితాను ఆవిష్కరించుకునే ముందరి దాకాఆ చిత్రకారుడు బయటా లోపలా జరిగిన ప్రయాణానికి వ్యక్త రూపాలు.అదంతా అన్సంగ్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవెలప్ మెంట్ –కలగలపు-ఇక్కడేఅయన బలమి ఉన్నది. ఇందులోనే అయన సృజన శక్తి మెండుగ నిబిడీకృతమై ఉన్నది. మార్కెట్లో వారి చిత్రాలకు ఆదరణ పెరిగాక అందరం చూసిన బొమ్మ ఒకటైతే, ఆ బొమ్మ వెనుకాలిపరిణామ క్రమం ఇప్పుడు ప్రదర్శనలో ఉన్నది.
అవన్నీ ఏమిటీ అంటే పాత్రలు- పాత్రధారులు. తన స్వస్థలం, గ్రామం ప్రధానంగా తన ఇల్లూ వాకిలీ మూలంగా, ఇరుగు పొరుగూ సాక్ష్యంగా, చిన్న నాటి జానపద రూపాలు వేదికగా, తనను కదిలించి ఎదిగించిన పాత్రలే భూమికగా ఉన్నవి. అదంతానూ సామాన్యమూ, మహిళకన్నా పురుష ప్రధానమూ అనే చెప్పాలి.
రంగుల‘కళ’
చిత్రమేమిటంటే, అయనసినిమాలకుఆర్ట్ డైరెక్టర్గా పని చేసే రోజుల్లో తన ‘రంగుల కళ’అభవృద్ది ఐనప్పటికీ సరిగ్గా ఆ సమయంలోనే అయన సామాన్యుడిని, లేబర్ ని ఆజానుబాహువుగా చిత్రించారు. మట్టి మనుషులు, వారి ముఖాలు, గాట్లు, పుట్టుమచ్చలు, అన్నీనూ ఎంతో శక్తి కొద్దీ చిత్రాల్లోకి రావడం జరిగింది. ఐతే, తనదైన శైలిని సంతరించుకున్నాక తాను విజయవంతమైన చిత్రకారుడిగా ఎదగడానికి మాత్రం అయనచిత్రాలను ఆక్రమించిన మహిళ పాత్రఅత్యంతముఖ్యమైంది.ఆ మహిళ మువ్వన్నెలతో మెరిసిపోవడం విశేషమే అయింది.
అందరివాడు
సిరిసిల్లలో ఆయనకు ఆర్ట్ టీచర్ రామా చారి మొదలు, బరోడాలో విఖ్యాత చిత్రకారులు కె జి సుబ్రహ్మణ్యం వరకూ, హైదరాబాద్ లోని తన కాలేజీ సీనియర్లు ఐనప్రసిద్ద చిత్రకారులు సూర్య ప్రకాష్, లక్ష్మా గౌడ్ లు, సినిమాలకు కళా దర్శకత్వం నేరపడానికి కారణమైనబి.నరసింగ రావు గారలు, అందరూ అయనను మేల్కొల్పిన వారేఅయినాతనంతటతాను అవిశ్రాంతగా ఎదిగి రావడంలో - అదిభాల భవన్ కావొచ్చు,తర్వాత కొంతకాలం ముంబైలో బొమ్మలకు రంగులు వేసిన చిరుద్యోగం కావొచ్చు, ముందూవెనకా అన్నీ ఉన్నాయ్.
అందరూ ఉన్నారు. ఐతే,అన్నీ అయన భావనా తరంగానికి వూతమిచ్చినవే అని చెప్పాలి.ముందే చెప్పినట్లు పెన్సిల్ గీతలు, చార కోల్ బొమ్మలే వాటన్నిటికీ మౌలికం, పునాది అనాలి. అలాగేస్వగ్రామమే తన ఐడెంటిటీ అనే చెప్పుకోవాలి.
రామ చిలుక – దువ్వేనా – కోడి పుంజు
వైకుంఠం గారిచిత్రాల్లో స్త్రీల భుజాలపై వాలిన రామ చిలకతానదైన ప్రతీక. ఐతే, అంతకుముందు చేతులో కోడి పుంజుతో ఉన్న మహిళ చిత్రం ఇక్కడుంది. అలాగే, ఒక దువ్వెన తో ఊసులడుతున్న మగువా ప్రదర్శనలోఉన్నది. ఇవి అయన ముందరి చిత్రాలు. అటు తర్వాతే రామ చిలక ప్రధానంగావన్నె తేలినట్లు గోచరిస్తున్నది. ఐతే, ఈ పరిణామం ఒక్క చిలుకలోనే కాదు,వారి చిత్రకళా ప్రయాణంలో ఇలాంటిఇతర అనేక బొమ్మల వికాసాన్ని అధ్యయనం చేసి లోతుగా రాయవలసి కూడా ఉన్నది.
ముగ్దులైననైరూప్యంచిత్రకారులు
ప్రదర్శనలోవైకుంఠం గారి abstract చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయ్. అవి చూసిన వారు ఇవి వైకుంఠంచిత్రలేనా అని అబ్బురపడతారు. అంతెందుకు? ప్రముఖ నైరూప్య చిత్రకారులు శ్రీ సూర్య ప్రకాష్ గారేవిస్మయానికి గురైనారు.“ఒకవేళవైకుంఠంఇవే గనుక సాధన చేసి ఉన్నట్లయితే ఈయన విశిష్టమైన నైరూప్య చిత్రకారుడిగా ఎదిగి, ఎందరికో సవాల్ విసిరేవాడు” అనిఅయన కితాబనిచ్చారు. “అదృష్టవశాత్తూ అయన ఆ పని చేయకపోవడం తమవంటి వారికిమేలైనది” అని కూడాఅభిమానంగా పంచుకోవడం అయన గొప్పతనానికి,వైకుంఠంగారిప్రతిభకూ నిదర్శనం.
నెల విడవని సాము
ఐతే,తన గురుదేవులు శ్రీ కె.జి.సుబ్రహ్మణ్యం గారి సూచనతో తాను మూలాలకు అంటి పెట్టుకుని,రియలిస్టిక్ చిత్రలవైపే మొగ్గు చూపానని, తన గ్రామమే తన ప్రపంచంగా, అక్కడినుంచే వస్తువును సంగ్రహించి, దానికే వన్నెలు అద్దినానని వైకుంఠంగారు ప్రదర్శన ప్రారంభంలో వివరించడం విశేషం. తనకువెన్ను దన్నుగా నిలిచిన వారిని పేరు పేరునా గుర్తు చేసుకోవడం వారి వినమ్రతకు నిదర్శనం.
బాలభవన్ నుంచే ప్రయోగాలు
భాలభావన్ లో పని చేసే రోజుల్లో వైకుంఠంగారి ప్రయోగాత్మకత గుర్తించనిమేనేజ్ మెంట్ అయన పని తీరు పట్ల అప్పట్లోసానుకూలంగా లేకపోవడాన్ని అప్పటి కొలిగ్ ఒకరు ప్రస్తావిస్తూ,ఇప్పటి పరిణితి, వైభవం వెనుక ఎవరినీ లెక్క చేయకుండా బొమ్మకు ప్రాణం పోసిన వైకుంఠందీక్షతను, మొండితనాన్ని గుర్తు చేశారు. “ఇంతకష్ట పడ్డారు కనుకే అయనసిగ్నేచర్ స్టైల్ నేడు విశ్వవిఖ్యతమైంది. బొమ్మల నుంచి శిల్పాల దాకా అందరూ విస్మయంతో చూసి అందిస్తున్నారు” అని ఆనందంగా అభినందించారాయన.
శిల్పాలు ప్రత్యేక ఆకర్షణ
కాగా,కళాకృతిలోవారి ఇత్తడి శిల్పాలు మరో చూడ ముచ్చట.వైకుంఠంగారి రేఖాలావణ్యాన్ని, నిండైనఅతడి బొమ్మలరూప శీలతను,సహజమూ సామాన్యమూ ఐన వర్ణాలతోనే విశిష్టతను రంగరించే తీరు మనకు తెలుసు. అలంటి బొమ్మలు ఇంతదాకాకన్వాసుకే పరిమితమైనవి చూశాం. ఐతే, ఇక్కడరెండు జతలదంపతుల బొమ్మలుప్రాణం పోసుకునిమనముందుసజీవంగా నిలుచున్నట్టు కానరావడం విశేషం.
నల్లనివాడు
ఒక చిత్రకారుడిగా వైకుంఠం గారి పరిణామ క్రమం చూడ ముచ్చట.ముందే చెప్పినట్టు పెన్సిల్,చార్ కోల్, ఆ పిదప వర్ణాలు, ఇప్పుడు శిల్పాల దాకా అంతా కూడా ఒక జగత్తు. ఇదిచిత్రకళలో ఉన్నవారికే కాదు,వివిధ రూపాల్లోవిజువల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేసే ఎవరికైనా ఇందలిబొమ్మల పరిణితి, సుదృడమైన అయన రేఖా లావణ్యపు పోకడ, ఒక గొప్ప అనుభవం. రెట్రాస్పెక్ట్. మరి చూడండి.
మహాప్రస్థానం- ముందర
ఐతే, వైకుంఠంగారిగత వైభవం, విశిష్టతఇకముందుఇంకా చాలా పెరుగ నున్నది.నిజానికిఅందులో కొంచెం ప్రదర్శించారు గానీ ఇంకా ఎంతో ఉన్నది. దశలు దశలుగా అయన లోకాలు వేరు.అదంతానిరుడు సామాన్యం. ఇక అసామాన్యం అన్నట్టే.
ఎన్నో ఉన్నాయ్.సంగీత వాయిద్యాలు. ఆటో మొబైల్స్, ఎరోటిక్ డ్రాయింగ్స్ మాత్రమే కాదు, పల్లెటూరు, అందలి ఇండ్లు, దర్వాజాలు, మొగురాలు, దూలాలు, బొళ్లు, బొకెలు, చెంబులు, ఇంటిని, ఇంట్లఉండేసమస్తాన్నిడ్రాచేశారాయన. ఇవిఅప్పుడుపైసలు తేకపోవచ్చు. కానీ ఇవే ఎప్పటికైనానిజమైన స్థిరాస్తి.ఇకఊరి మీద పడి - పెద్ద బండ, చిన్న బండ, బర్రెలు, తాళ్ళు, ఇట్లాతాను అప్పుడు బయల్లెల్లిండు ఎంతో చేసిండు. పల్లెటూరి పిల్లగాడిని మొదలు లేబర్ నీ పట్టుకున్నాడు.ఆ లేబర్ పోట్రేట్లు ఈ ప్రదర్శనలో తప్పక చూడండి.ఐతే, తెలంగాణా మహిళ వచ్చే సరికి మనకెవరికీవైకుంఠ యాత్రలో ఈ సామాన్య మహా ప్రస్థానం కాన రాలేదు. కానీముందర ముందరఉన్నది అదే.అయన అన్నీ తవ్వుతాడని, ప్రతి బొమ్మా మనకు చూపుతారని నమ్మకం.