Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల యాప్ మీద గోప్యత: చిక్కుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపొందించినట్లు చెబుతున్న ఎన్నికల యాప్ మీద వివాదం రగులుకుంటోంది. ఎన్నికల యాప్ ను తయారు చేశారా, లేదా అనే సందేహం ఒక్కటి కాగా, దాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారనేది మరోటి.

AP SEC Nimmagadda Ramesh Kumar in trouble with Election app
Author
Amaravathi, First Published Jan 30, 2021, 2:28 PM IST

ఎన్నికల యాప్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) చిక్కుల్లో పడేట్లున్నారు. ఈ యాప్ గురించి ఎవరికీ తెలియకపోవడం, దాన్ని రహస్యంగా ఉంచడం, అది ఎలా తయారైందో చెప్పకపోవడం వంటి పలు కారణాలు ఆయనను చిక్కుల్లో పడేసే అవకాశాలున్నాయి. బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి.

ఇలాంటి టెక్నాలజీ వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (NITC)గానీ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం నిర్వహిస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల కోసం ప్రత్యేక యాప్‌ను ఎవరు తయారు చేశారని ఆయన అడిగారు. దీన్నిబట్టి చూస్తే నిమ్మగడ్డకు తిప్పలు తప్పేట్లు లేవనిపిస్తోంది. 

ఆ యాప్ గురించి అనంతపురంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా ప్రకటన చేసేంత వరకు ఎవరికీ తెలియదు. యాప్ జియోలో ఏపీ పంచాయతీ ఎన్నికల పేరిట లభ్యమవుతుందని, దానికి రికార్డింగ్ మెసేజ్ లు, ఫొటోలు, సందేలాసు పంపించవచ్చనని ఆయన శుక్రవారం చెప్పారు. సందేశం ఇచ్చివారికి రిప్లై ఇస్తామని కూడా ఆయన చెప్పారు. తొలిసారికే అది విజయవంతం కాదని, మూడో దశకల్లా బలపడుతుదని, పట్టు వస్తుందని ఆయన చెప్పారు. 

అయితే ఆ యాప్ రూపకల్పన గురించి ఏపీ ప్రభుత్వానికి తెలియదని అర్థమవుతోంది.  దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని రెండు రోజుల క్రితం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యదర్శి చెప్పారు. అయితే ఆ తర్వాత అలాంటిదేమీ లేదని చెప్పారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి దాని గురించి తెలియదని అర్థమవుతోంది.

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ విషయం తెలియదని విష్ణువర్ధన్ రెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది. దానిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత నిమ్మగడ్డ రేష్ కుమార్ మీదే ఉందని కూడా ఆయన అన్నారు. 

యాప్ ఉందని చెబుతున్న నిమ్మగడ్డ దాని లాగిన్ ఐడి, పాస్ వర్డ్ ఎవరికీ ఇవ్వలేదు. అది తన వద్దనే ఉంటుందని కూడా చెప్పారు. జిల్లా కలెక్టర్లకు ఆ యాప్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. అయితే సీఈసీ పంపిన ఫిర్ాయదులు మాత్మరే ఎవరి జిల్లావి వారికి కనిపిస్తాయి, సీఈసీ తనకు వచ్చిన ఫిర్యాదుల్లో కావాలనుకున్నవాటిని మాత్రమే కలెక్టర్లకు పంపించే అవకాశం ఉంది. తనకు ఇష్టం లేని ఫిర్యాదులను డిలిట్చేయవచ్చు.

ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ఓ ప్రైవేట్ వ్యక్తి మాదిరిగా రమేష్ కుమార్ యాప్ నిర్వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోసం తానే ప్రత్యేక యాప్ ను తయారు చేస్తున్నట్లు చెప్పి ఏడాది క్రితం పంచాయతీరాజ్ శాఖ తయారు చేయించిన యాప్ ను నిమ్మగడ్డ పక్కన పెట్టాలని ఆదేశాలిచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఆయితే, ఆ యాప్ ను ఇంకా తయారు చేయించలేదని కూడా నిమ్మగడ్డ అనంతపురంలో చెప్పడం కొసమెరుపు. 

దానికితోడు కమిషన్ కార్యాలయంలో ఎన్నికల సెల్ ను ఏర్పాటు చేశామని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. ఆ సెల్ కు కేటాయించిన ఫోన్ నెంబర్ల విషయంలో కూడా గోప్యత పాటిస్తున్నారు. కమిషన్ కార్యాలయంలో 15 మంది లోపే రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తుండగా, 20 మంది దాకా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని అంటున్నారు. ఆ సెల్ నిర్వహణ బాధ్యత ఔట్ సోర్సిగ్ ఉద్యోగులే చూస్తున్నారు. ఇందులో కూడా మతలబు ఉందని అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios