ఎన్నారై భర్త అరాచకం.. నగ్నంగా వీడియో కాల్ చేయాలని వేధింపులు, ఒప్పుకోనందుకు చితకబాదిన అత్తామామలు.. !

2020 ఆగస్ట్ 21న వారిద్దరికీ వివాహం జరిగింది. అయితే కొద్ది రోజులకే అతడు తన నిజస్వరూపం బయటపెట్టాడు. రోజూ మద్య సేవించి ఇంటికి ఆలస్యంగా రావడం, తాగిన మత్తులో తూలుతూ ఇంటికి చేరుకోవడం, తనను కొడుతూ హింసించడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు చెప్పాపెట్టకుండ కెనడా వెళ్లిపోయాడు.

NRI Husband Seeks Nude Video Calls From Wife in Ahmedabad In-Laws Thrash Woman For Refusing to Fulfil Demand

అహ్మదాబాద్ : భార్యకు వీడియో కాల్ చేసిన ఎన్నారై భర్త ఓ వింత కోరిక కోరాడు. దీంతో కంగుతిన్న భార్య అందుకు ఒప్పుకోలేదు. తానలా చేయలేనని ప్రాథేయపడింది. కానీ ఆ భర్త ఒప్పుకోలేదు.  విషయం తెలుసుకున్న అత్తామామలు కొడుకుకు బుద్ధి చెప్పకపోగా.. కోడలినే దారుణంగా కొట్టారు. 

దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటు చేసుకుంది. 

బాధిత మహిళ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. అహ్మదాబాద్ లోని గోటా ప్రాంతంలో ఆమె నివసిస్తోంది. తన భర్తను సొంత కమ్యూనిటీకి చెందిన మ్యాట్రిమోని సంస్థ ద్వారానే ఆమె మొదటిసారి కలిసింది. ఇరు కుటుంబాలూ ఒప్పుకోవడంతో 2020 ఆగస్ట్ 21న వారిద్దరికీ వివాహం జరిగింది. అయితే కొద్ది రోజులకే అతడు తన నిజస్వరూపం బయటపెట్టాడు. 

రోజూ మద్య సేవించి ఇంటికి ఆలస్యంగా రావడం, తాగిన మత్తులో తూలుతూ ఇంటికి చేరుకోవడం, తనను కొడుతూ హింసించడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు చెప్పాపెట్టకుండ కెనడా వెళ్లిపోయాడు.

కెనడాకు వెళ్లిన తరువాత నుంచి అసభ్యకరమైన, అనుచితమైన మెసేజ్ లు భార్యకు పంపడం ప్రారంభించాడు. అలాగే సెల్ ఫోన్ లోనే సెక్స్ చాట్ చేయాలని, కెమెరా ముందు నగ్నంగా కనపడాలని ఒత్తడి చేసేవాడు. దానికి బాధితురాలు అంగీకరించకపోవడం, తనకు అదంతా ఇష్టం లేదని, తాను చేయలేనని చెప్పడంతో అతడు బూతులు తిడుతూ విరుచుకుపడేవాడు.

అలాగే తనపై లేనిపోనివి చెప్పి అత్తామామలతో కొట్టించేవాడు. కొడుకు చేస్తున్న పనికి తప్పుపట్టి బుద్ధి చెప్పాల్సిందిపోయి, కోడలినే కొట్టి హింసించేవారు. అలాగే అదనపు కట్నంగా బంగారం, నగదు తీసుకురావాలని ఒత్తిడి చేసేవారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios