వీళ్లకు పోసుకోవడానికి స్థలమే దొరకట్లేదా? లిఫ్ట్‌లోనే కానిచ్చేస్తున్నారు? ఇదివరకు ఇలాగే రెండు నెలల క్రితం ఓ బాలుడు లిఫ్ట్‌లోని నెంబర్స్ ప్యానెల్ మీద మూత్రం పోశాడు. దీంతో ఆ లిఫ్ట్ షార్ట్ సర్క్యూట్ అయి మధ్యలోనే ఆగిపోయింది. మరో ఘటనలో ఓ బాలుడు లిఫ్ట్ డోర్‌కు కాలును పెట్టి వ్యాయామం లాంటిది ఏదో చేయబోయాడు. దీంతో లిఫ్ట్ డోర్లు మధ్యలోనే తెరుచుకున్నాయి. తాజాగా ఇద్దరు యువకులు, ఓ యువతి లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ డోర్లు మూసుకున్నాయో లేదో.. ఇద్దరు యువకులు చెరో సైడ్‌కు వెళ్లి మూత్రం పోశారు. లిఫ్ట్‌ లోపల యువతి ఉన్నప్పటికీ వాళ్లు ఆ పని కానిచ్చేశారు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. వాళ్లు పోస్తున్నప్పుడు.. ఆ యువతి లిఫ్ట్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాను తన చేతితో ఆపడానికి ప్రయత్నించింది. కాని.. తనకు ఆ కెమెరా అందలేదు.