ఉద్యోగులకు ఫ్రీ పిజ్జా ఆఫర్

First Published 24, Mar 2018, 11:41 AM IST
Offering free pizza to employees boost productivity study
Highlights
  • ఉద్యోగులకు పిజ్జా ఆఫర్ చేస్తే .. ఏం జరుగుతుందో తెలుసా..?

ఉద్యోగులకు ఉచితంగా ప్రతిరోజూ పిజ్జా ఆఫర్ చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఎందుకో తెలుసా..? కంపెనీ ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి. పిజ్జాకి.. కంపెనీ ప్రొడక్టివిటీకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? సంబంధం ఉందండి.. ఉద్యోగులకు ప్రతి రోజూ పిజ్జా ఆఫర్ చేస్తే.. ఉద్యోగులు మరింత రెట్టింపు వేగంతో పనిచేస్తున్నారట. తాజా సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కొన్ని కంపెనీలు ప్రయోగాత్మకంగా దీనిని నిరూపించాయి కూడా.

ఓ ప్రముఖ సైకాలిజిస్ట్ డాన్ అరేలి.. దీనిపై సర్వే చేశయగా.. ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇజ్రాయిల్ లోని ఇంటెల్ కంపెనీ.. ఎక్కువ ఫలితాలు సాధించేందుకు ఎం చేస్తోందనే విషయంపై ఆరా తీశాడు. కాగా.. సదరు కంపెనీ.. ఉద్యోగులకు మూడు ఆఫర్ ఇస్తోందట. అందులో మొదటిది.. బాగా పనిచేసిన ఉద్యోగులకు క్యాష్ ప్రైజ్, ఇక రెండోది ఉద్యోగిని బాస్ పొగడ్తలతో ముంచెత్తడం. ఇక మూడోది పిజ్జా ఆఫర్ చేయడం.

కాగా.. ఈ మూడింటిలో కూడా పిజ్జా ఆఫర్ చేసిన సమయంలో ప్రొడక్టివిటీ ఎక్కువగా కనపడటం విశేషం. మిగిలిన రెండు ఆఫర్ లలో కూడా ఫలితం కనిపించినప్పటికీ.. పిజ్జా ఎక్కువ  ఫలితాన్ని రాబట్టింది. దీంతో.. ఈ ఆఫర్ ని సదరు కంపెనీ కొనసాగించడం విశేషం.

loader