సింధు, సైనాలకు భారీ షాక్

IOA wants ministry to allow parents of Sindhu and Saina to accompany them in CWG
Highlights

  • సైనా, సింధులకు షాక్ ఇచ్చిన క్రీడాశాఖ

బ్యాడ్మింటన్ క్రీడాకారిణిలు సైనా నెహ్వాల్, పీవీ సింధులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల సహాయ సిబ్బంది, కుటుంబ సభ్యుల జాబితాపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కోత విధించింది. క్రీడాకారులతోపాటు వారి కుటుంబ సభ్యులు, సహాయ సిబ్బంది ఎవరో ఒకరు వస్తుంటారు.  క్రీడాకారుల జాబితాతో పాటు వారి కుటుంబసభ్యుల జాబితాను కూడా  భారత్ ఒలింపక్ సంఘం తయారు చేసింది. ఈ జాబితాను కేంద్రానికి పంపగా అందులో భారత 21 మందికి కేంద్రం  అనుమతి నిరాకరించింది.  కేంద్రం నిరారకరించిన వారిలో పి.వి.సింధు తల్లి విజయ, సైనా నెహ్వాల్‌ తండ్రి హర్‌వీర్‌సింగ్‌ ఉన్నారు.

ఐతే..మాజీ షూటర్‌ రోనక్‌ పండిట్‌ పేరును కూడా జాబితా నుంచి తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొంటున్న షూటర్‌ హీనా సిద్ధుకు రోనక్‌ భర్త. కొన్నేళ్ళుగా ఆమెకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. పైగా భారత పిస్టల్‌, రైఫిల్‌ జట్టు హై పర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ కూడా. హీనా సిద్ధు భర్త అనే కారణంతో రోనక్‌ను తప్పించడంపై షూటింగ్‌ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోనక్ విషయంలో కేంద్రం మార్పులు ఏవైనా చేస్తుందేమో చూడాలి.

loader