సుందర్ పిచాయ్ పంట పడింది: ఆయన చేతికి రూ.2,500 కోట్లు

సుందర్ పిచాయ్ పంట పడింది: ఆయన చేతికి రూ.2,500 కోట్లు

న్యూఢిల్లీ: గూగుల్ సిఈవో సుందర్ పిచాయ్ చేతికి రూ.2,500 కోట్లు అందనున్నాయి. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్స్)గా 2014లో పదోన్నతి పొందినప్పుడు ఆయనకు కంపెనీ 353939 నియంత్రిత షేర్లను కేటాయించింది. వాటిని ఆయన 2015లో అందుకున్నారు. 

కంపెనీ షరతులన్నీ నెరవేర్చిన తర్వాత వాటిని సంబంధిత వ్యక్తికి పూర్తిగా బదలాయిస్తారు. ఇప్పుడు వాటి విలువ 380 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో అది 2,524 కోట్ల రూపాయలు. వాటిని బుధవారం నగదుగా మార్చుకునే అవకాశం పిచాయ్ కి ఉంది. 

ఓ పబ్లిక్ కెంపెనీ ఉన్నతాధికారికి ఇటీవలి కాలంలో ఏక మొత్తంగా లభించిన అత్యధిక సొమ్ములో ఇది ఒకటి. అయితే, 2017లో ఆయన ఎంత పారితోషికం చెల్లించారనే విషయాన్ని వెల్లడించలేదు.  

తమ ఆధీనంలోని డజను వేర్వేరు సంస్థలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునే విధానాన్ని గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ వెల్లడించింది. యుఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్ కు సమర్పించిన వివరాలను బట్టి గూగుల్, ఇతర సంస్థల ఆర్థిక కార్యకలాపాలను విభజించారు. 

అల్ఫాబెట్ కు 98 శాతం రెవెన్యూ గూగుల్ నుంచే సమకూరుతోంది. గూగుల్ పై సుందర్ పిచాయ్ కి అధికారం ఉంది. గూగుల్ ఉత్పత్తులు యూట్యూబ్, ప్రకటనలు, హార్డ్ వేర్ లకు సంబంధించి వారంవారీగా, నెలవారీగా ఆర్థిక సమాచారం ఆయనకు అందుతుంది. పెట్టుబడి వ్యయాలు, సిబ్బంది సంఖ్య కూడా ఆయన తెలుస్తాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos