Asianet News TeluguAsianet News Telugu

క్యాష్ లెస్ సెక్స్ ట్రేడ్, కర్టసీ.....

పూర్తి నగదు,అస్సలు అప్పే ఉండని  ‘ఈ వ్యాపారం’  గత నెలలో దారుణంగా పడిపోయినా ఇప్పుడు  ప్రభుత్వాలు ప్రమోట్ చేస్తున్న ఈ-పేమెంట్ విధానంతో తిరిగి పుంజుకొంటోంది.

cashless sex  courtesy demonetisation

ప్రధాని మోడీ పెద్దనోట్ల రద్దు ఉద్దేశం రోజుకో మలుపు తిరుగుతోంది.

 

నోట్ల రద్దు ప్రకటన తర్వాత ప్రసంగాలను(నవంబర్ 8-27 మధ్య) 100 పాయింట్ల పట్టిక మీద విశ్లేషించి... మొదట్లో 80 పాయింట్ల దగ్గరున్న నల్లధనం అరికట్టడమన్న విషయం 25 పాయిట్లకు వస్తే,దొంగనోట్ల వ్యవహారం 24 పాయింట్ల నుంచి 0(సున్న)కు చేరుకుంది.మరి పెరిగిన ప్రాధాన్యత దేనిదంటారా? 0(సున్న) నుంచి 75 పాయింట్లకు చేరుకున్న డిజిటల్/నగదు రహిత లావాదేవీలు అంటూ తేల్చారు నిపుణులు.   

 

అసలు ఈ నగదురహిత చెల్లింపులు అన్న విషయం ప్రపంచంలో ప్రాచీనమైన వృత్తిని ఎంత ఆధునీకరించిందో ఎవరైనా ఊహించగలిగారా?పూర్తి నగదు,అస్సలు అప్పే ఉండని వ్యాపారం గత నెలలో దారుణంగా పడిపోయినా ఇప్పుడు ఈ-పేమెంట్ విధానంతో తిరిగి పుంజుకొంటోంది.

 

ఆ వ్యాపారం శరీర వ్యాపారం అని గ్రహించి ఉంటారనుకుంటా.  

 

మొదట్లో పాత 500,1000 నోట్లను తీసుకున్నా,భారీ డిస్కౌంట్స్ ఇచ్చినా తమ వ్యాపారం నిల్పుకోవటానికి మొబైల్ వాలెట్స్ కు మారకతప్పలేదు.ఈ వ్యాపారాన్ని చేసే ఒక ఏజెంట్ తన దగ్గర ఉన్న సెక్స్ వర్కర్లకు కొత్త్ సిమ్‌కార్డ్స్ అందజేసి ఈ-వాలెట్ ఆప్స్ డౌన్లోడ్ చేయించా అంటున్నాడు.అంతే కాదు విటుల సౌకర్యార్ధం వై-ఫై సదుపాయాన్నీ కల్పించి ఆప్ లేని వారికి దాన్ని డౌన్లోడ్ చేయించి డిజిటల్ కరెన్సీ పద్దతిని చక్కగా పాటిస్తున్నారని చెప్పాడు.

 

మరొక వ్యాపారి జనాదరణ తక్కువ ఉన్న ఆప్స్ వాడుతూ ప్రభుత్వం కంట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నాడు.

 

సాధారణ స్థాయి సెక్స్ వర్కర్ రోజువారీ సంపాదన 3000-4500 మధ్య ఉంటే నాగరిక,నాజూకు అమ్మాయిల ప్రారంభధరే 15,000 పైచిలుకు.ఇక ఈవాలెట్స్ లో నిర్ణీత సొమ్మువరకే లావాదేవీలు చేయాలి కనుక గుట్టలకొద్దీ సిమ్‌కార్డ్స్ కొని ఆప్స్ డౌన్లోడ్ చేసామని కొందరు చెబుతున్నారు.

 

మొత్తానికి పెద్దనోట్ల రద్దుతో అతి ప్రాచీన వ్యాపారాన్ని ఇలా కొత్త పుంతలు తొక్కించాడు మన ప్రధాని.భారతదేశం వెలిగిపోతోందంటూ అప్పటి వాజ్ పేయి ప్రభుత్వ నినాదం...అప్పటి సంగతేమో కానీ ఇప్పుడు పీడిత,తాడిత,పతితులు,బాధాసర్ప ద్రష్టులు డిజిటల్ భారతం వైపు అడుగులేస్తున్నారు అని చంకలు గుద్దుకుంటారేమో!!!! 

Follow Us:
Download App:
  • android
  • ios