Asianet News TeluguAsianet News Telugu

ప్రేమను నిరాకరించిందని, మత్తు ఇచ్చి బలవంతంగా పెళ్లి.. ఒప్పుకోలేదని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం..

ఓ యువతిని కిడ్నాప్ చేసిన యువకుడు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. దీనికి ఆమె అంగీకరించలేదని తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. 

woman kidnapped and married, gang raped by lover in rajasthan
Author
First Published Nov 21, 2022, 9:53 AM IST

రాజస్థాన్ : ప్రేమిస్తున్నాను అంటూ యువతిని ఓ యువకుడు చాలా రోజులుగా వేధిస్తున్నాడు. అతని ప్రేమను ఆ యువతి అంగీకరించలేదు. దీంతో ఆ యువతికి మత్తు మందు ఇచ్చి ఆమెను తన స్నేహితులతో కలిసి ఆ యువకుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఓ గుడిలో బలవంతంగా వివాహం చేసుకున్నాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత యువతి ఆ పెళ్లి నిరాకరించింది. దీంతో ఆ యువకుడు తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన రాజస్థాన్ చోటు చేసుకుంది.

రాజస్థాన్లోని జైపూర్ ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కాలనీకి చెందిన యువతిని విమల్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతడి ప్రేమను ఆ యువతి అంగీకరించలేదు. దీంతో విమల్ ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ వేశాడు. ఆ యువతి చేత మత్తు మందు కలిపిన టీ తాగించాడు. ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే తన గ్రామానికి తీసుకువెళ్ళి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన యువతి తనకు జరిగిన ఈ విషయాన్ని గమనించుకుని  షాక్ అయింది. ఆ పెళ్లిని తిరస్కరించింది.  

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విమల్ తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. దుండగుల బారినుండి ఎలాగే బయటపడ్డ యువతి.. శనివారం సాయంత్రం జైపూర్కు చేరుకుంది. వెంటనే పోలీస్ స్టేషన్కు చేరుకుని తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతిని మెడికల్ చెకప్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు నిందితులకు కోసం గాలింపు ప్రారంభించారు. 

ఛత్తీస్ గఢ్ లో దారుణం.. యువతిని చంపి, మృతదేహాన్ని కారు ఢిక్కీలో కుక్కి..

ఇదిలా ఉండగా, నవంబర్ 19న దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో షాకింగ్  ఘటన వెలుగు చూసింది. ప్రియురాలిపై అనుమానంతో సహజీవనం చేస్తున్న ప్రియుడు ఆమెను చంపిన ఘటన ఆగ్నేయ ఢిల్లీలోని మదన్ పూర్ ఖాదర్ ప్రాంతంలో వెలుగు చూసింది. గురువారం నాడు 30 ఏళ్ల ఓ వ్యక్తి తన ప్రియురాలు తనకు నమ్మకద్రోహం చేసిందనే అనుమానంతో చంపేశాడు. నిందితుడిని ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రాహుల్‌గా గుర్తించారు. మృతురాలు రాహుల్  22 ఏళ్ల స్నేహితురాలు గుల్షానాగా గుర్తించారు. ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే కారణంతో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.

గత శుక్రవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో ఒక మహిళ తాళం వేసిఉన్న ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉందని పోలీసులకు కాల్ వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె మరణించినట్లు గుర్తించారు. తరువాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గుల్షానా తన భర్త నుంచి విడిపోయి ఏడాది వయసున్న కుమార్తెతో కలిసి ఉంటోది. శవపరీక్ష నివేదికలో ఆమె గొంతు నులిమి చంపినట్లు ధృవీకరించబడింది. సరితా విహార్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో, గుల్షానా మృతదేహం లభించిన గది యజమాని గత 20-22 రోజులుగా రాహుల్ అనే వ్యక్తి అక్కడ ఉంటున్నాడని పోలీసులకు చెప్పాడు. ఆ శుక్రవారం రాహుల్ నుంచి తనకు కాల్ వచ్చిందని, తన స్నేహితురాలు మూర్ఛ వ్యాధితో బాధపడుతూ తన గదిలో స్పృహతప్పి పడిపోయిందని, ఆ సమయంలో తాను గదిలో లేడని చెప్పాడు. దీంతో రాహుల్ మొబైల్ నంబర్‌పై నిఘా ఉంచామని, బుధవారం ఇక్కడి ఆలీ జంగిల్ ప్రాంతంలో అతడిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios