బాలయ్య బాబాయ్ చేయల్సిన సినిమా.. అబ్బాయి ఎన్టీఆర్ దగ్గరకు ఎలా వచ్చి చేరింది..?
బాలయ్య బాబు.. ఎన్టీఆర్ బాబాయి అబ్బాయిల మధ్మ... పెద్ద వార్ నడుస్తుంది అంటారు కొందరు.. లేదు వాళ్లు బాగానే ఉన్నారంటారు మరికొందరు. ఇక వీళ్ల మధ్య సినిమా పంపకాలు జరిగాయంటూ మరో వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేశారంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..?
నందమూరి నట వారసత్వం తీసుకుని బాలయ్య బాబు.. ఆతరువాత జూనియర్ ఎన్టీఆర్... తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రారాజులుగా వెలుగుతున్నారు. ఈ ఫ్యామిలీ నుంచి ఎంత మంది వచ్చినా..ఎవరూ వీరిద్దరిలా స్టార్లు కాలేకపోయారు. ఇక వీరి మధ్యకూడా కొన్నాళ్ళు పాజిటీవ్ వైబ్స్.. మరికొన్నిరోజులు నెగెటీవ్ వైబ్స్..ఇలా రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి.
కాని ఇంత వరకూ వీరిద్దరి మధ్య గొడవలున్నాయా..? లేక మంచిగా ఉన్నారా అనే విషయరంలో క్లారిటీ లేదు. మీడియాలో రకరకాలుగా రావడం తప్పించి ఎవరికీ ఈ విషయంలో నిజం తెలియదనే చెప్పాలి. ఇక ఈక్రమంలో.. ఈ ఇద్దరు నందమూరి తారల గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. బాలయ్యబాబు చేయాల్సిన ఓ సినిమాను ఎన్టీఆర్ చేసి.. సూపర్ హిట్ కొట్టాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..?
బాలకృష్ణను ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా..? ఏమని పిలుస్తారంటే..?
ఎన్టీఆర్ ను హీరోగా నిలబెట్టి.. మాస్ ఇమేజ్ ను అమాంతం పెంచిన సినిమా సింహాద్రి. ఇది NTRను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా. ఆది తరువాత మళ్ళీ అలాంటి సినిమా ఒక్కటి పడితే.. బాగుంటుంది అనుకున్న టైమ్ లో.. అల్లరి రాముడు, నాగ లాంటి ప్లాప్ లు ఆయన్ను పలకరించాయి. ఈక్రమంలో ఎలాగైనా ఒక మంచి హిట్ కొట్టాలన్న కసితో NTR కథలు వింటున్నారు.
మరో వైపు బాలకృష్ణ కోసం విజయేంద్ర ప్రసాద్ ఒక మంచి కథను రెడీ చేశారట. ఆ కథను బి గోపాల్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా మాస్ సినిమాగా చేయాలి అని అనుకున్నారట. కాని అదే టైమ్ లో గోపాల్ వేరే కథను సెలెక్ట్ చేసుకోవడంతో ఈ కథ అలాగే ఉండిపోయింది. బాలయ్యతో బి గోపాల్ వేరే కథతో సినిమా చేయగా.. ఈ కథను మాత్రం రాజమౌళి NTR కు వినిపించమన్నాడట.
balakrishna ntr
అప్పటికే మాస్ సినిమా కోసం ఎదరు చూస్తున్న ఎన్టీఆర్ ఈ కథ వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే బాలయ్య కోసం రాసుకున్న ఈ కథలో.. అప్పటికీ చిన్న పిల్లోడు అయిన 20 ఏళ్లు ఎన్టీఆర్ సరిపోతాడా అని విజయేంద్రప్రసాద్ అనుమానం వ్యక్తం చేయడంతో …. అప్పటికే స్టూడెంట్ నెంబర్ 1 ను తీసిన అనుభవంతో రాజమౌళి.. తారక్ గురించి తెలిసి. ముందుకువెళ్ళాడట.
ఇక ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ అనుకున్నారు.. కాని ఆమె వెంకటేష్ జోడీగా.. వసంతం సినిమాతో బిజీగా ఉండడంతో అంకితను, భూమికను తీసుకున్నారు. డైరెక్టర్ గా రాజమౌళి గురించి తెలిసిందే.. మ్యూజిక్ కీరవాణి గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. అప్పట్లో 8 కోట్ల బడ్జెట్ తో చేసిన ఈసినిమా.. 2003 జులై 9 న రిలీజ్ అయ్యి... 25 కోట్లు సాధించి పెట్టింది. సింగమలై అంటూ తారక్ పై ఫ్యాన్స్ చూపించిన అభిమానా అంతా ఇంతా కాదు.. అప్పట్లో ఇదో మ్యానియాలా తయారయ్యింది.