ఈ మధ్యకాలంలో యువకుల టార్గెట్ చేసి వ్యాపారం చేసుకోవాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. ఇటీవల హైదరాబాద్ నగరంలో మేల్ ఎస్కార్ట్స్ కావాలంటూ కొంతమంది యువతను దారుణంగా మోసం చేశారు. తాజాగా ఇలాంటి సంఘటనే మరోటి చోటుచేసుకుంది.

యువకులకు ఓ మహిళ ఫోన్ చేసి శృంగార వీడియోలు కావాలా అంటూ బేరం ఆడుతుండటం గమనార్హం. కేవలం రూ.వెయ్యి చెల్లిస్తే.. ఐదు శృంగార వీడియోలు ఇస్తానని.. అదే రూ.1500 చెల్లిస్తే.. పది అశ్లీల వీడియోలు ఇస్తానంటూ బేరమాడింది. అయితే.. ఆమె మాటలకు కంగారుపడ్డ కొందరు యువకులు తమకు అవసరం లేదని తేల్చి చెప్పారట. అలా చెప్పినందుకు వారిని మరోలా బెదిరించడం మొదలుపెట్టడం గమనార్హం. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read నగరంలో నయా దందా.. ఆంటీలను తృప్తి పరిస్తే డబ్బులే డబ్బులు!...

 చెన్నై మదురవాయల్‌కు చెందిన ఉదయరాజ్‌ (26) ప్రైవేటు సంస్థ ఉద్యోగి. అతన్ని ఫోన్‌లో సంప్రదించిన ఓ మహిళ గూగుల్‌ పే ద్వారా రూ.100 పంపితే మహిళల చిత్రాలను పంపిస్తామని తెలిపారు. ఆమె ఆఫర్ ని అతను తిరస్కరించాడు.

దీంతో వెంటనే అమ్మాయిల శృంగార వీడియోలు పంపిస్తానంటూ బేరమాడింది. రూ.1000 పంపితే ఐదు శృంగార వీడియోలు, రూ.1,500 పంపితే 10 శృంగార వీడియోలను పంపిస్తామని తెలిపారు. దీనికి ఉదయరాజ్‌ ఒప్పుకోలేదు. తనకు ఏమీ అవసరం లేదని చెప్పాడు.

అయితే.. రివర్స్ లో సదరు మహిళ.. ఉదయ్ రాజ్ తనను వేధిస్తున్నాడంటూ పోలీసుకు ఫిర్యాదు  చేయడం గమనార్హం. ఆ విషయం చాలా ఆలస్యంగా ఉదయ్ రాజ్ దృష్టికి వచ్చింది. దీంతో ఉదయరాజ్‌ అదే పోలీసుస్టేషన్‌కు తనకు వచ్చిన ఎస్‌ఎంఎస్‌లు, సెల్‌ఫోన్‌లో సంభాషించిన దానిని రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి సెల్‌ఫోన్‌ నెంబరు ఆధారంగా మహిళ కోసం గాలిస్తున్నారు.