లక్నో: వేరే మహిళతో ఉన్న తన భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తనను కాదని మరో మహిళతో అతను షాపింగ్ కు వచ్చాడు. అది చూసి భార్య ఆవేశంతో అతన్ని తిడుతూ, అతనిపై పిడి గుద్దులు కురిపించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో ఈ సంఘటన జరిగింది. వారి మధ్య గొడవ పెద్దది కావడంతో దుకాణం యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. వారిద్దరికి ఇది వరకు వివాహం జరిగింది. ఇందులో బాధితురాలు అయేషా, తన భార్య అద్నాన్ కు 2002లో వివాహం జరిగినట్లు తెలిపిందే. కొద్ది రోజులకే తనను పుట్టింట్లో వదిలేశాడని చెప్పింది.

విడాకులు ఇవ్వాలని బలవంతం చేశాడని చెప్పింది. అయితే తనకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పింది. తమకు ఇంకా విడాకులు లభించలేదని, అందువల్ల తన భర్త మరో మహిళతో తిరగడానికి వీలు లేదని ఆమె చెప్పింది. 

అయితే, తనకు అయేషా అంటే ఇష్టం లేదని, ఇప్పటికే విడాకులు ఇచ్చానని, తను వేరే మహిళతో షాపింగ్ చేస్తే అనవసరంగా గొడవ చేస్తోందని చెప్పాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.